రేపటి రోజున జరగబోయే చిరంజీవి పుట్టినరోజు వేడుకల హడావిడి ఈరోజు విడుదల అయిన ‘సైరా’ టీజర్ విడుదలతో మొదలైంది. ఈసందర్భంలో రామ్ చరణ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ దర్శకుడు సురేంద్ర రెడ్డి ‘సైరా’ మూవీకి దర్శకత్వం వహించడానికి ముందుపడిన మానసిక సంఘర్షణను వివరించాడు.
రియాల్టీ ఉట్టిపడేలా సెట్స్
మెగాస్టార్ తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారని అయితే సురేందర్ రెడ్డి మాత్రం ‘సైరా’ ఆఫర్ ఒప్పుకోవడానికి టైమ్ తీసుకున్నాషాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు చరణ్. ‘ధృవ’ తరువాత సురేంద్ర రెడ్డ్డి తను తదుపరి తీయబోయే సినిమా కథల గురించి వెతుకుతున్న సమయంలో తాను ఒకరోజు సురేంద్రరెడ్డిని పిలిపించుకుని ఒకసారి పరుచూరి గోపాలకృష్ణను కలవమని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు చరణ్. 
రత్నవేలు సినిమాటోగ్రఫీ
అయితే పరుచూరి చెప్పిన ఆకధ విన్నాక సురేంద్ర రెడ్డి తనకు వారం రోజులు సమయం కావాలి అని అడిగాడని దీనికి కారణం చిరంజీవితో సినిమా అంటే ఒక పెద్ద బాధ్యత అన్న విషయాన్ని సురేంద్ర రెడ్డి గుర్తించి తనను సమయం అడిగిన విషయాన్ని ఇప్పుడు ఆలస్యంగా బయట పెట్టాడు చరణ్.  అయితే ఒక స్థిర నిర్ణయం వచ్చిన తరువాత సురేంద్ర రెడ్డి ‘సైరా’ కథను సింగిల్ సిట్టింగ్ లో చెప్పి చిరంజీవిని ఇంప్రెస్ చేశాడంటూ సురేంద్ర రెడ్డి పై ప్రశంసలు కురిపించాడు చరణ్. 
బ్రిటిషర్ల అకృత్యాలు
అయితే తనకు తెలిసినంత వరకు సింగిల్ సిటింగ్ లో తన తన తండ్రి చిరంజీవి ఒకే చేసిన సినిమా కథ ‘సైరా’ మాత్రమే అంటూ ఆమూవీ పై మరింత అంచనాలు పెంచాడు చరణ్. దాదాపు 12 సంవత్సరాల నుండి నలుగుతున్న ‘సైరా’ కథకు ఒక  రూపు తీసుకు వచ్చిన ఘనత సురేంద్ర రెడ్డిది అంటూ మరింత ప్రశంసలు కురిపించాడు చరణ్. ఈరోజు విడుదలైన ‘సైరా’ టీజర్ మెగా అభిమానులకు విపరీతమైన జోష్ ను కలిగిస్తూ ఉంటే ఈ టీజర్ మరీ భారీగాలేదు కానీ మెగా స్టార్ చిరంజీవి లుక్  వీరోచిత నటనకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వచ్చేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: