1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే తెలుగు నాట ఒక స్వేచ్ఛా సమర వీరుడు బ్రిటిష్‌ ప్రభుత్వంపై తిరగబడి, తన స్వేచ్ఛ కోసం, తన ప్రాంత స్వాతంత్య్రం కోసం తెల్లదొర తనంపై యుద్ధం చేసి తన తడాఖా చూపించాడు! ఆయనే 1840 దశకం నాటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. పాలెగాళ్లు అంటే, బ్రిటిష్‌ ప్రభుత్వం ఏలుబడిలోనే ఉండి, వారి తరపున పన్నులు వసూలు చేసి, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఆత్మగౌరవం కోసం పోరాటాన్ని ప్రారంభించిన ధీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి.  అంత గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడి జీవిత కథ ఆధారంగా చేసుకొని మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.
Image result for సైరా నరసింహారెడ్డి
కాగా, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సైరా’టీజర్ నిన్న ఉదయం 11.30  రిలీజ్ చేశారు.   చిరు పుట్టిన రోజుకు ఒక రోజు ముందే అభిమానులకు పండుగ వాతావరణం తీసుకువచ్చిందీ టీజర్‌. అంచనాలకు మించి ఈ టీజర్ లో చిరంజీవి వివ్వరూపాన్ని చూపించారు.  ఉగ్రరూపుడైన నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి లుక్ అదిరిపోయింది..బ్రిటీష్ వారిని ఎలా ఎదుర్కొన్నారో ఈ చిత్రంలో కనిపిస్తుంది. కేవలం 33 సెకన్ల టీజర్ చూస్తేనే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి. ఈ టీజర్ పై ప్రేక్షకులే కాదు సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు.  ఇదిలా ఉంటే..ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రానికి ఆంధ్రప్రదేశ్ పన్ను రాయితీ ఇవ్వాలి అనే డిమాండ్ వినపడుతుంది.
చిరంజీవి ఉయ్యాలవాడ లుక్ పై భిన్నాభిప్రాయాలు !
కర్నూలు ప్రాంతంలో ఉండి ఆంగ్లేయులను గడగడలాడించిన ఉయ్యాలవాడ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి అనే డిమాండ్ వినపడుతుంది. గతంలో రుద్రమదేవి సినిమాకు తెలంగాణా ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకపోవడంపై సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. కాగా,  కర్నూలు ప్రాంతంలో ఉండి ఆంగ్లేయులను గడగడలాడించిన ఉయ్యాలవాడ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి అనే డిమాండ్ వినపడుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమిత్ త్రవేదీ సంగీతాన్ని అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: