తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చారు.  రీ ఎంట్రీతోనే తన స్టామినా ఎంటో చూపించిన మెగాస్టార్..తన 151వ చిత్రం భారత దేశ తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. 

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రంలో ఇతర భాషా నటులు అమితాబచన్ , విజయ్ సేతుపతి, సుదీప్  నటించడం మరో విశేషం.  ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు..ఈ సందర్భంగా ఆయనకు సినీ ఇండస్ట్రీనే కాదు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఇక అభిమానుల ఆనందం ఓ రేంజ్ లో ఉంది..దానికి కారణం నిన్న ‘సైరా’ టీజర్ రిలీజ్ కావడం.  తమ హీరో ఎలా చూడాలి అనుకున్నారో..అందకు రెట్టింపు ఉత్సాహం నరసింహ రెడ్డి పాత్రలో కనిపించారు చిరంజీవి.

ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగాస్టార్ కి వైసీపీ ఎమ్మెల్యే రోజాశుభాకాంక్షలను తెలిపారు. 'మా అందరివాడు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఫొటోలను షేర్ చేశారు.నిన్న హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగాహీరోలంతా అభిమానులతో కలసి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: