కేరళా బాధితుల కోసం ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మేమున్నాం అన్న ధైర్యాన్ని నింపుతుంది.  గత పదిహేను రోజుల నుంచి కేరళ గరళ భారీ వర్షాల కార‌ణంగా వరద గుప్పిట్లో చిక్కుకుంది.. వ‌ర‌దలు, వ‌ర్షాల ప్ర‌భావంతో ఇప్ప‌టికే 400 మందికి పైగా మ‌ర‌ణించారు..20వేల కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లింది. విద్యుత్, స‌మాచార వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది.. 14 ల‌క్ష‌ల మందికి పైగా పున‌రావాస కేంద్రాల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. 
Image result for kerala floods
వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన భారంగా తయారయింది. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పటికీ సరిపోవడం లేదు. 
Image result for kerala floods
ప్ర‌పంచ వ్యాప్తంగా కేర‌ళ‌ను ఆదుకునేందుకు దాత‌లు త‌మ వంతు స‌హాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ కేరళ కోసం ఓ పాటను అంకితం చేశారు. ‘ప్రేమదేశం’ చిత్రంలోని ‘ముస్తఫా ముస్తఫా’ పాటను పేరడీగా చేసి ‘కేరళ..కేరళ..డోన్ట్‌ వర్రీ కేరళ’ అంటూ పాటను ఆలపించారు.  ఇటీవల లాస్‌ఏంజెల్స్‌లో కచేరీలో పాల్గొన్న రెహమాన్‌..కేరళ వాసులకు ధైర్యం చెబుతూ ఈ పాటను వారికి అంకితం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: