నిన్నజరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మెగా కాంపౌండ్ లోనే కాకుండా అల్లువారింటిలో  కూడ చాలసందడిగా జరిగాయి. అల్లు ఫ్యామిలీ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు   చాలాకాలం తరువాత అల్లు వారింట జరగడం వెనుక చాల కారణాలు ఉండటమే కాకుండా ఈపార్టీకి మొత్తం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కూడ రావడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
chiru
నిన్నజరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మెగా కాంపౌండ్ లోనే కాకుండా అల్లువారింటిలో  కూడ చాలసందడిగా జరిగాయి. అల్లు ఫ్యామిలీ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు   చాలాకాలం తరువాత అల్లు వారింట జరగడం వెనుక చాల కారణాలు ఉండటమే కాకుండా ఈపార్టీకి మొత్తం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కూడ రావడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య సాన్నిహిత్యంలో తేడాలు ఓపెన్ గానే కనిపించేవి. బన్నీ పవన్ ల మధ్య అదేవిధంగా చరణ్ బన్నీల మధ్య ఏర్పడిన గ్యాప్ గురించి అనేక గాసిప్పులు హడావిడి చేసాయి.  దీనికితోడు అరవింద్ చిరంజీవిల మధ్య సంబంధాలలో కొంత తేడా వచ్చింది అన్న గాసిప్పులను వీరిద్దరి ఫ్యామిలీలకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడ ఖండించలేకపోతూ ఉండేవారు.
Chiranjeevi,Moustache,Pics
ఇలాంటి పరిస్థుతులలో శ్రీరెడ్డి కామెంట్స్ తరువాత విభేదాలను పక్కకు పెట్టి శ్రీరెడ్డి కామెంట్స్ పై స్పందిస్తూ ముందుకు వచ్చిన పవన్ కు అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీల సపోర్ట్ దొరకడమే కాకుండా పవన్ కోసం మెగా అల్లు హీరోలు అంతా ఒకే మాటపై నిలబడ్డారు. ఆతరువాత జరిగిన సంఘటనలలో భాగంగా నిన్న అల్లు అరవింద్ ఇంట్లో మళ్ళీ మెగా అల్లు ఫ్యామిలీల కుటుంబ సభ్యులు చిరంజీవి పుట్టినరోజు వేడుకల కారణంతో కలిసిన కలయిక వెనుక ఒక రాజకీయ కోణం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan
గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాలలో ముభావంగా ఉంటున్న అల్లు అరవింద్ కు ‘గీత గోవిందం’ సక్సస్ విపరీతమైన ఉత్సాహాన్ని ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఉత్సాహంతోనే రాబోతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏకాకి కాడనీ అతడి వెనుక మెగా అల్లు కుటుంబాల మొత్తం సపోర్ట్ ఉంది అని సంకేతాలు ఇవ్వడానికి అరవింద్ ఇలా వ్యూహాత్మకంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను తన ఇంటిలో ఘనంగా జరపడమే కాకుండా ఆపార్టీకి పవన్ వ్యక్తిగతంగా ఆహ్వానించడమే కాకుండా ఈపార్తీ ద్వారా అల్లు కుటుంబానికి పవన్ కు ఏర్పడ్డ దూరాన్ని పూర్తిగా తుడిచి వేయడంలో అరవింద్ సక్సస్ అయ్యాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగా అల్లు కుటుంబాలు ఇప్పుడు ఒకటి అయ్యాయి కాబట్టి పవన్ రాజకీయాలకు ఈకలయిక ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: