గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుతం కోస్తా ప్రాంతంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు బాలయ్యకు అదృష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం జరుపుకునే సినిమాల షూటింగ్ విషయంలో అనుమతుల విషయంలో ప్రభుత్వం సడలించిన షరతులు అదేవిధంగా చిన్న సినిమాలకు టాక్స్ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సహకాలు అన్నీ కలిసి బాలకృష్ణకు ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 
Balakrishna
తెలుస్తున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చిన్న సినిమాల విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు వల్ల విశాఖపట్నం రాజమండ్రి ప్రాంతాలలో చాల ఎక్కువగా సినిమా నిర్మాణాలు జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనికితోడు సినిమా నిర్మాణానికి సంబంధించి సరైన స్టూడియోలు డబ్బింగ్ ధియేటర్స్ ల్యాబ్స్ ఇలా అనేక సౌకర్యాలు ఇంకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిని నేపధ్యంలో ఈవిషయమై అనేక కొత్త ప్రాజెక్ట్స్ అతి త్వరలో రూపుదిద్దుకునే ఆస్కారం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 
Balakrishna
ప్రస్తుతం నడుస్తున్న ఈ ట్రెండ్ ను బాలకృష్ణ తనకు అనువుగా మార్చుకునే వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. విశాఖపట్నం దగ్గర రిషి కొండ ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం స్టూడియోని ‘ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిలిం స్టూడియో’ పేరుతో ఏర్పాటు చేయడానికి బాలకృష్ణ అత్యంత విలువైన భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తీసుకుని తన స్టూడియో కట్టే ఆలోచనలకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
 Balakrishna meets penukonda bus accident victims
వాస్తవానికి ఇలాంటి స్టూడియో అమరావతి ప్రాంతంలో కట్టాలని బాలకృష్ణ గతంలో భావించినా ఇప్పుడు అతడి ఆలోచనలు అన్నీ విశాఖపట్నం రిషి కొండ ప్రాంతం పై ఉన్నాయని తెలుస్తోంది. అయితే వాస్తవానికి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు హైదెరాబాద్ లో రామకృష్ణ స్టూడియో ఉన్నా దాని అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచించని బాలకృష్ణ ఇప్పుడు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫిలిం స్టూడియో గురించి ఆలోచించడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: