తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు హీరో అజిత్ కుమార్.   తెలుగు ఇండస్ట్రీలో ‘పెళ్లిపుస్తకం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ సాధించలేక పోయాడు.  ఆ తర్వాత తమిళనాట అడుగు పెట్టిన అజిత్ వరుస విజయాలతో తమిళ తంబీల మెప్పు పొందాడు.  ప్రస్తుతం అజిత్ చిత్రాలు అంటే అక్కడ మాస్ ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  

Image result for ajit nayanatara

అజిత్‌ హీరోగా వీరం, వేదలం,వివేగం సూపర్‌ హిట్స్  అందించిన శివ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.   విశ్వాసం చిత్రంలో అజిత్ ఓ డాన్‌గా క‌నిపించ‌నుండ‌గా, తొలిసారి ఈ సినిమా కోసం చెన్నై త‌మిళ స్లాంగ్‌లో అజిత్ డైలాగులు చెబుతాడ‌ని స‌మాచారం.

Image result for ajit nayanatara

విశ్వాసం సినిమా అభిమానుల అంచ‌నాలు మించేలా , చ‌రిత్రలు తిర‌గరాసేలా తెర‌కెక్కుతుంద‌ని కోలీవుడ్ టాక్  వినిపిస్తుంది.  ఈ చిత్రానికి డి ఇమాన్‌ సంగీతమందిస్తున్నారు. గ‌తంలో అజిత్‌తో క‌లిసి తొలిసారిగా ఏగ‌న్ అనే చిత్రం చేసింది న‌య‌న‌తార . ఆ త‌ర్వాత‌ బిల్లా, ఆరంభం అనే చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు విశ్వాసం చిత్రంతో నాలుగో సారి జ‌త‌క‌డుతున్నారు. మ‌రి ఈ కాంబినేష‌న్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: