బుల్లితెర హాట్ యాంకర్ గా యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయిన రేష్మీ సినిమాలలో కూడ తన హవా చాటాలని తన శక్తిమేరకు ఎక్స్ పోజింగ్ చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈరోజు విడుదల అయిన ‘అంతకు మించి’ మూవీలో కూడ రేష్మీ ఎక్స్ పోజింగ్ చాల ఎక్కువగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
Rashmi Gautam Latest Photos
తన అందమైన కాళ్ళను ఎవరైనా ఇన్సూరెన్స్ చేస్తే బాగుండును అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రేష్మీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 2’ విన్నర్ ఎవరు అన్న విషయమై తన అంచనాలను బయట పెట్టింది. ఇప్పటికే హౌస్ లో జరిగే అంశాలపై అదేపనిగా లీకులు వస్తున్న నేపధ్యంలో ఈషో తుది విజేత ఎవరు అన్న విషయం పై క్లారిటీ రావడంతో ఈషో విజేత ఎవరు అన్న విషయమై ఆలోచనలు చేసే బదులు సోషల్ మీడియాలో ఈషో వెంట నడిచే వివాదాల్ని ఫాలో అయ్యేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
jabardasth-anchor-reshmi-photos-_10_
ఈపరిస్తుతుల నేపధ్యంలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ కౌశల్ పేరు మీద ఆర్మీ తయారు కావటం బుల్లితెర మీద కౌశల్ వ్యక్తి ఆరాధన పీక్స్ కు చేరటంపై రేష్మీ స్పందించింది. ‘బిగ్ బాస్ 2’ విన్నర్ గా ఖచ్చితంగా కౌశల్ ను కాకుండా మరెవరిర్నీ అనౌన్స్ చేయడం జరగదని అలా చేస్తే గొడవలు అయిపోతాయి అంటూ జనం ధర్నాలు చేసినా
ఆశ్చర్య పడవలసింది లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
jabardasth-anchor-reshmi-photos-_3_
అంతేకాదు మరో ట్విస్ట్ ఇస్తూ రేష్మీ తాను ‘బిగ్ బాస్ 2’ చూడటం లేదని కేవలం సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ను బట్టి తాను ఇలా అభిప్రాయ పడుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. దీనితో రేష్మీ కూడ కౌశల్ ఆర్మీ చేస్తున్న ప్రచారానికి ప్రభావితం అయిందా అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కౌశల్ కోసం అతడి అభిమానులు ప్రస్తుతం గీతా మాధురిని టార్గెట్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే కౌశల్ ఆర్మీ ఒక పెద్దయుద్ధమే చేస్తున్నట్లు కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: