నాగచైతన్య సమంతల పెళ్లి అయ్యే వరకు నాగార్జున చైతూ సినిమాల విషయంలో అన్నీ తానై వ్యహరించే వాడు. అయితే సమంత చైతు జీవితంలోకి వచ్చేసిన తరువాత చైతన్య సినిమాల విషయంలో సమంత జోక్యం ఎక్కువైందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తల హడావిడి చేస్తున్నాయి. 
Samantha Latest Image
చైతూ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం అయినా ఇంకా తన భర్తకి టాప్ హీరో స్టేటస్ రాకపోవడంతో సమంత ప్రస్తుతం చైతన్యకు స్టార్‌ స్టేటస్‌ తీసుకురావడం కోసం తన వ్యూహాలను పూర్తిగా మార్చివేసే ఆలోచనలలో ఉన్నట్లు టాక్. చైతూ సినిమాల కథల ఎంపికతో పాటు చైతన్య నటించిన సినిమాలలోని సీన్స్ ను చూసి సలహాలు ఇవ్వడంతో పాటు మార్పులు చేర్పులు సూచిస్తున్న నేపధ్యంలో చైతన్య సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతోంది అంటూ ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది. 
Samantha talks about her Ragamma Mangamma Song Rangasthalam starring Ram Charan
నాగచైతన్య తరువాత ఇండస్ట్రీకి పరిచయం అయిన చాలామంది యంగ్ హీరోలు టాప్ రేంజ్ కి చేరిపోయినా ఇంకా చైతు కెరియర్ పరంగా పూర్తిగా సెటిల్ అవ్వకపోవడం సమంతను కలవర పెడుతున్నట్లు టాక్. దీనితో సమంత తన వ్యూహాలు మార్చడంతో చైతు లేటెస్ట్ మూవీలు ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ సినిమాలు సమస్యలలో పడినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఇండస్ట్రీ వార్తల హడావిడి ప్రకారం ఎన్నడూ లేని విధంగా సమంత ఈరెండు సినిమాల ఎడిటింగ్ విషయంలో విపరీతమైన సూచనలు ఇస్తూ ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ మూవీల డైరెక్టర్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్.  ఒకవిధంగా ఈరెండు సినిమాల ఆలస్యానికి సమంత చూపుతున్న మితిమీరిన అత్యుత్సాహం అని అంటున్నారు. ఈ జోక్యం నిజమే అయితే దీని ఫలితాలు సక్సస్ ను ఇవ్వకుండా మరోలా అయితే సమంత వ్యూహాల వల్ల చైతన్య దెబ్బతినే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: