‘జబర్దస్త్’ యాంకర్ రష్మీ ఎంత ఎక్స్ జింగ్ చేసినా జనం అసలు పట్టించుకోవడం లేదు. ఆమె లేటెస్ట్ గా నటించిన మూవీ ‘అంతకు మించి’ మొన్న శుక్రు వారం విడుదలైన నేపధ్యంలో ఈమూవీకి కనీసపు ఓపెనింగ్స్ కూడ రాలేదు. 
I Have Learnt From my Mistakes: Rashmi Gautam
ఈసినిమాలో కూడ రష్మీ హాట్ సీన్స్ లో నటించినా ఎవరూ ధియేటర్స్ వైపు రాకపోవడంతో హీరోయిన్ గా రష్మీ కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళడం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  అయితే ఈ యాంకర్ తన ప్రయత్నాలను మానకుండా తనదైన రీతిలో ఈమూవీని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూనే ఉంది. 
anchor rashmi gautam fires on nata
దీనికోసం తన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న నేపధ్యంలో ఆమెకు ఒక అభిమాని ఒక ఊహించని ప్రశ్న అడిగాడు. మీరు ఇతర దర్శకుల సినిమాలలో నటించే బదులు మీరే మంచి మంచి సినిమాలు తీయవచ్చుకదా అంటూ ఒక అభిమాని కొంటె ప్రశ్న వేసాడు.  అయితే ఆవీరాభిమాని ప్రశ్నకు సమాధానంగా రష్మీ ఊహించని సమాధానం ఇచ్చింది. 
jabardasth-anchor-reshmi-photos-_10_
మీకు నా అకౌంట్ డిటైల్స్ పంపిస్తాను నా అకౌంట్లో 3 కోట్లు వేయండి. నేనే సొంతంగా సినిమాను చేస్తాను అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ అనుకోని సమాధానికి మరొక ప్రశ్న వేయకుండా ఆవీరాభిమాని మౌనం వహించాడు. ఈ సంభాషణ రష్మీ సమయస్పూర్తికి నిదర్శనంగా కనిపించినా కేవలం హాట్ ఎక్స్ పోజింగ్ సీన్స్ తో హీరోయిన్ గా స్థిరపడాలి అని రష్మీ చేస్తున్న ఆలోచనలు మాత్రం పెద్దగా కలిసి రావు అనీ ఆమె లేటెస్ట్ మూవీ ‘అంతకు మించి’ మరొకసారి రుజువు చేసింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: