‘గీత గోవిందం’ కలక్షన్స్ మ్యానియా నిన్నటి వర్కింగ్ డే సోమవారం కూడ కొనసాగడంతో ఈమూవీ 100 కోట్ల సినిమాగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమా కథను దర్శకుడు పరుశురామ్ అల్లు కాంపౌండ్ దృష్టికి తీసికి వచిన్నప్పుడు వీలుంటే అల్లు అర్జున్ లేకుంటే అల్లు శిరీష్ లతో ఈమూవీ చేయాలని భావించినట్లు టాక్. 

ఈకథ నచ్చినా అల్లు అర్జున్ ఈమూవీలో నటించడానికి సాహసించక పోవడంతో ఈ కథతో  తనను హీరోగా పెట్టి మూవీ తీయమని అల్లు శిరీష్ అరవింద్ పై తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. గతంలో శిరీష్ పరుశురామ్ ల కాంబినేషన్ లో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా మోడరేట్ హిట్ అయిన నేపధ్యంలో తిరిగి ఆ కాంబినేషన్ ‘గీత గోవిందం’ కథతో రిపీట్ చేస్తే మంచి సక్సస్ వస్తుందని శిరీష్ ఎన్ని సార్లు తన తండ్రి అరవింద్ కు చెప్పినా అరవింద్ శిరీష్ తో ఈమూవీని తీసే ధైర్యం చేయలేక విజయ్ దేవరకొండ వైపు మళ్ళినట్లు టాక్. 
allu arjun, Sarrainodu, allu arjun Sarrainodu, allu arjun upcoming movies, allu arjun news, entertainment news
వాస్తవానికి ‘గీత గోవిందం’ మూవీకి ఈ రేంజ్ హిట్ వస్తుందని బన్నీ కాని శిరీష్ కాని ఊహించలేదు అని అంటున్నారు. ఒక విధంగా ఆలోచిస్తే తమ సొంత గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక కొత్త హీరోను టాప్ రేంజ్ హీరోగా తయారు చేసిన పరిస్థుతులు ఏర్పడటం అల్లు హీరోలకు షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 
No automatic alt text available.
ఇప్పటి వరకు అల్లు అర్జున్ కలలు కంటున్న ఓవర్సీస్ 2 మిలియన్ కలక్షన్స్ మార్క్ ను కేవలం 3వ సినిమాతో విజయ్ అందుకోవడం బన్నీకి కూడ జీర్ణించుకోలేని విషయంగా మారింది అని అల్లు కాంపౌండ్ టాక్. దీనితో శిరీష్ ఒక మంచి ఛాన్స్ ను మిస్ అయ్యాను అన్న ఆవేదనతో ‘గీత గోవిందం’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫిలిం ఇండస్ట్రీలోని మీడియం రేంజ్ హీరోలకు కూడ విజయ్ దేవరకొండ రికార్డులను చూసి కలవర పడుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు సంవత్సరాల లోపు ‘గీత గోవిందం’ స్థాయిలో కొంత కాలం వరకు ఒక మోడరేట్ సినిమా ఘన విజయం సాధించే అవకాశం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: