‘బాహుబలి’ తో ఇండియన్ టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ కు ఏమాత్రం గర్వం లేదని అందరితో నవ్వుతూ చాలసన్నిహితంగా ఉంటాడు అన్న విషయానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘సాహో’ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముఖేష్ ప్రభాస్ పై ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో వ్యక్త పరిచిన అభిప్రాయాలు ప్రభాస్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Bollywood, Golmaal, Rohit Shetty, Neil Nitin Mukesh, Tabu, Parineeti Chopra, Golmaal Again, Rukmini Sahay, Udaipur, Ajay Devgn,
తన చిన్నప్పటి నుండి తనతండ్రి ఏమనిషి జీవితం అయినా మర్రి చెట్టులా ఉండాలి అని చెప్పిన సందర్భాలను గుర్తుకు చేసుకుంటూ మర్రి చెట్టు ఎంత ఎదిగినా దాని ఊడలు భూమిని తాకే నేపధ్యంలో మనుషులు కూడ ఎంత గొప్పవారు అయినా తమ మూలాలు మరిచిపోకూడదని తన తండ్రి చెప్పిన విషయాలు ప్రభాస్ లో కనిపిస్తున్నాయి అంటూ ప్రశంసలు కురిపించాడు నీల్ నితిన్ ముఖేష్. అందువల్లనే తనకు ఎప్పుడు ప్రభాస్ ను చూసినా మర్రిచెట్టు గుర్తుకు వస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
Saaho is going to Prabhas' next big release after the mega success of SS Rajamouli's magnum opus Baahubali.
ఇదేసందర్భంలో ఈబాలీవుడ్ యాక్టర్ మాట్లాడుతూ తాను ప్రభాస్ తో కలిసి దుబాయ్ లో ‘సాహో’ షూటింగ్ లో ఉన్నప్పుడు జరిగిన ఆసక్తికర సంఘటనను వివరించాడు. ఆసమయంలో తన భార్య డెలివరీకి సిద్ధంగా ఉన్నవిషయం తాను ప్రభాస్ కు చెప్పినప్పుడు ప్రభాస్ చూపించిన ఆత్మీయత తన మైండ్ బ్లాంక్ చేసింది అని అంటున్నాడు. 
Major rumour killer regarding Prabhas’ marriage
దుబాయ్ లో ఉన్న రకరకాల షోరూమ్స్ లో పసిపిల్లలకు సంబంధించిన అబ్బాయి బట్టలు అమ్మాయి బట్టలు రెండు బ్యాగ్స్ నిండా కొని తనకు పుట్టబోయే బిడ్డ కోసం తన గిఫ్ట్ అంటూ ఒకరోజు రాత్రి తన హోటల్ రూమ్ కు వచ్చి బహుమతి ఇచ్చిన ప్రభాస్ ను చూసిన వెంటనే తన తండ్రి తన చిన్నతనంలో చెప్పిన మర్రిచెట్టు విషయం గుర్తుకు వచ్చింది అంటూ కామెంట్స్ చేసాడు. ప్రభాస్ ఆతిధ్యం గురించి అదేవిధంగా అతడు చేసే అతి మర్యాదలు గురించి ఇప్పటికే ఎందరో సెలెబ్రెటీలు చెప్పినా నీల్ నితిన్ ముఖేష్ మర్రి చెట్టు పొగడ్త మాత్రం ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: