రాజమౌళి తాను తీసే సినిమా విషయంలో ఏచిన్న విషయంలోనూ రాజీ ప్రసక్తిలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టే అతడిని ఇప్పటి వరకు పరాజయాలు దరిచేరలేదు. ‘బాహుబలి’ తో ఇండియన్ టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి తన లేటెస్ట్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిన ఈమూవీకి సంబంధించి నటీనటుల ఎంపిక విషయమై శ్రద్ధపెట్టిన రాజమౌళి ఈసినిమాకు సంబంధించి జూనియర్ ఆర్టిస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమంలో అనుసరిస్తున్న శ్రద్ధ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ లో నటించే అనేకమంది జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేయడానికి వారికి మేకప్ టెస్ట్ లు అదేవిధంగా డైలాగ్ రిహార్సల్స్ కూడ చేయించే పనిలో ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్నట్లు టాక్. 
SS Rajamouli
సాధారణంగా ఇలాంటి శ్రద్ధ సినిమాలలో నటించే కీలకపాత్రల విషయంలో తీసుకుంటూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో తీసుకుంటున్న మితిమీరిన జాగ్రత్తలు వలన ఈమూవీ షూటింగ్ ప్రారంభం డిసెంబర్ లో కూడ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే భారీ గ్రాఫిక్స్ తో కూడుకున్న ఈమూవీ నిర్మాణ పనులు పూర్తి అయి విడుదల కావడానికి 2020 సమ్మర్ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 
S. S. Rajamouli at the trailer launch of Baahubali.jpg
ఒక భారీ విజయం అందుకున్న తరువాత సాధారణంగా దర్శకులు తాము తీసే సినిమాల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోరు. అందువల్లనే రాజమౌళి సినిమాలు అంటే పరాజయాలు ఎరుగని సినిమాలుగా గత 18 సంవత్సరాలుగా కొనసాగుతూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరొక సరికొత్త రికార్డ్ ను రాజమౌళి క్రియేట్ చేస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: