తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్ ఒక్క వెలుగు వెలిగిపోయారు..హీరోగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే ఆయన టీడీపీ పార్టీని స్థాపించారు.  అప్పట్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెబుతూ..తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిచారు.  అప్పటి వరకు తెలుగు ప్రజలపై కొనసాగిస్తున్న కాంగ్రెస్ జోరుకి కళ్లెం వేశారు ఎన్టీఆర్. 
Image result for nandamuri harikrishna
ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు నందమూరి హరికృష్ణ.  తన తండ్రి తారక రామారావు చైతన్య రథానికి సారథిగా వ్యవహరించి... తండ్రి అఖండ విజయంలో కీలకపాత్ర పోషించారు హరికృష్ణ. చైతన్యరథంతో ఆయనకున్న అనుబంధం చాలా ఎక్కువ. అన్న టీడీపీనీ స్థాపించిన తర్వాత కూడా ఆయన చైతన్య రథంపైనే ప్రచారం చేశారు. 

అయితే హరికృష్ణకు ఎంతో ఇష్టమైన ఆ చైతన్య రథంపైనే ఆయన అంతిమ యాత్ర నిర్వహించాలకునున్నారు కుటుంబ సభ్యులు..కాకపోతే 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం చైతన్య రథాన్ని ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు తరలించినట్టు సమాచారం. రామకృష్ణ స్టూడియోలో ఉన్న ఈ రథానికి ప్రస్తుతం రిపేర్లు జరుగుతున్నాయి. దాంతో ఇప్పుడు మరో వాహనాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్నారు.  చైతన్య రథం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోవాలని, అంతిమయాత్రకు ఆ వాహనాన్ని ఉపయోగించడం బాగుండదని కుటుంబసభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అంతిమయాత్రకు మరో వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: