తెలుగు ఇండస్ట్రీలో మహానటుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  ఆయన మృతితో ఇండస్ట్రీలో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి.  నటుడిగా, రాజకీయ నాయకుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ మంచి పేరు తెచ్చుకున్నారు.   అయితే తన చిన్న కుమారుడికి నందమూరి తారకరామ్ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని గతంలో జరిగిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా హరికృష్ణ వెల్లడించారు..'నాన్నకు ప్రేమతో' ఆడియో లాంచ్ ఫంక్షన్ సందర్భంగా ఆ రోజు హరికృష్ణ మాట్లాడుతూ..‘‘మా నాన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ మా ఏడుగురు అన్నదమ్ములకు కృష్ణ అనే పేరు కలసివచ్చేలా పెట్టారు.
Related image
అలాగే మా నలుగురు అక్కాచెల్లెళ్లకు ఈశ్వరీ అనే పేరు కలిపిపెట్టారు.  ఆయనకు దైవ భక్తి మెండుగా ఉండేది..అందుకే మా పేర్లలో భగవంతుడి పేరు వచ్చేలా కలిపారు.  అయితే నా పిల్లలకు పేర్లు పెట్టే బాధ్యత మా నాన్నగారికే వదిలానని అన్నారు.  పిల్లలు పుట్టినప్పుడు పేర్లు పెట్టాల్సిందిగా నాన్నగారి దగ్గరకు వెళ్లాను. నాన్నగారిని  ‘నా పిల్లలకు మీరే పేరు పెట్టాలి’ అని ఒత్తిడి చేశా. దీంతో ఇద్దరు పిల్లలకు జానకీ రామ్, కళ్యాణ్ రామ్ అని నాన్నగారు పేరు పెట్టారు. కానీ జూ.ఎన్టీఆర్ కు తారకరామ్ అని నేను పేరు పెట్టాను’’ అని చెప్పారు.
Image result for hari krishna kalyan ram ntr
 ఓ రోజు నాన్నగారు అవునూ నీ చిన్న కొడుకు ఎక్కడరా చాలా రోజులు అయ్యింది..వాడిని చూడాలనిపిస్తుందని ఓసారి తీసుకురా అని  అన్నారు.  వెంటనే తారక్ ని నాన్నగారి దగ్గరకు తీసుకు వెళ్లాను..అప్పుడు నీ పేరు ఏంటిరా అన్నాడు..వెంటనే తారక్ తాత గారూ..నా పేరు తారక్..నాన్న ఆ పేరు పెట్టారు అన్నాడు.  వెంటనే లేదు నువ్వు అచ్చం నా రూపం..నా పేరు నీకు ఉండాలి. ఈ రోజు నుంచి నీ పేరు తారక్ కాదు..నందమూరి తారక రామారావు గా మార్చారు.  అప్పటి నుంచి ఎన్టీఆర్ అని పిలవడం మొదలు  పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: