‘బిగ్ బాస్ 2’ రేటింగ్స్ పడిపోకుండా దాని క్రేజ్ మరింత పెంచడానికి ఎన్నిమార్గాలు ఉంటాయో అన్నిమార్గాలు స్టార్ మా యాజమాన్యం అనుసరిస్తోంది. ఈషోకి ప్రధాన ఆకర్షణగా మారిన కౌశల్ కు ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తున్న నేపధ్యంలో ఈషో విజేత ఎవరు అనే విషయం పై పెద్దగా సస్పెన్స్ లేదు. ఇది ఇలా ఉండగా ఈషో నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన  బాబు గోగినేని ఒకమీడియా సంస్థతో చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 
 ఒక ఛానల్ హెడ్
‘బిగ్ బాస్ 2’ లో కౌశల్ హాట్ ఫెవరెట్ గా కొనసాగుతున్న నేపధ్యంలో కౌశల్ ఫైనల్ చేరడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో బాబు గోగినేని మాట్లాడుతూ కౌశల్ ఆర్మీపై మండిపడ్డారు. కౌశల్ ఆర్మీ అయితే పాకిస్థాన్ ఇండియా బోర్డర్ లో యుద్ధం చేయాలి కానీ సోషల్ మీడియాలో యుద్ధాలు ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు బాబు గోగినేని. 
కౌశల్ అభిమానులు
అంతేకాదు తాను ‘బిగ్ బాస్’ షోలో కొనసాగుతున్న రోజులలో కౌశల్ తన భార్య గురించి తనతో చెప్పిన విషయాలను గురించి గుర్తుకు చేసుకుంటూ తనభార్య తనకోసం చాలా చేసేస్తోంది అని చెప్పిన విషయాలను బయటపెడుతూ అప్పుడు ఆమాటలు తనతో ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధం అవుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బాబు గోగినేని. ఇదే సందర్భంలో ఈసంచలన హేతువాది మరో అడుగు ముందుకు వేసి ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లిన వారు చాలామంది డీల్ కుదుర్చుకుంటున్నారని ఒక  ఛానల్ హెడ్ తనతో చెప్పిన విషయాన్ని బయట పెడుతూ ఇది సరైన పద్దతి కాదు అంటూ బాబు గోగినేని ఇచ్చిన లీకులు సంచలనాలు సృట్టిస్తున్నాయి. 
శ్యామల కూడా
అదేవిధంగా వైల్డ్ కార్డు ఎంట్రీగురించి మాట్లాడుతూ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వారికి బయట అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అది సరైన గేమ్ ఎలా అవుతుంది అంటూ ఎదురుప్రశ్నలు వేస్తున్నారు బాబు గోగినేని. అంతేకాదు కౌశల్ కి ఇంతమంది అభిమానులు ఉన్నారని తానూ అనుకోవడం లేదు అనిఅంటూ తనకు తెలిసినంత వరకు కౌశల్ ఏకైన అభిమాని నాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ఉదాహరణగా హౌస్ లో మిగిలిన ఇంటి సభ్యులు తప్పు చేస్తే విమర్శలు చేసే నాని కౌశల్ తప్పులు మాత్రం పట్టించుకోడని తన సహజ సిద్ధమైన శైలిలో బాబు గోగేని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: