గతంలో తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోలు ఒకే తెరపై కనిపించి కనువిందు చేసేవారు.  రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, సీనియర్ నరేష్ ల కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.  చాలా రోజుల తర్వాత ఇద్దరు కామెడీ హీరోలతో సుడిగాడు దర్శకులు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో స్టార‌ర్ చిత్రం సిల్లీ ఫెల్లోస్ తెరకెక్కుతుంది.   హీరోయిజంతో పాటు కామెడీని కలగలిపి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.
Image result for allari naresh sunil silly fellows
సెప్టెంబర్ 7న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుండ‌గా, మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. ఇటీవ‌ల‌ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.  రీసెంట్ గా బైక్‌ పైన వెళుతున్న నరేష్‌, గాల్లో వేలాడుతున్న‌ సునీల్ మధ్య జరిగే సంభాషణతో ఈ టీజర్‌ను డిజైన్‌ చేశారు.  ఆ తర్వాత ట్రైలర్ లో సునీల్, నరేష్ అల్లరి అంతా ఇంతా కాదు.   తాజాగా లైఫ్ హెడ్డేకురా అనే మాస్ సాంగ్ విడుద‌ల చేశారు. శ్రీ వ‌సంత్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు అందించ‌గా, పెంచ‌ల్ దాస్ పాట పాడారు. ఈ పాట సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది.
Image result for allari naresh sunil silly fellows
ఈ చిత్రంలో కథానాయికలుగా పూర్ణ, చిత్ర శుక్లా, నందిని రాయ్‌లు న‌టిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునీల్ కమెడియన్‌గా నటించిన విషయం విదితమే. ప్ర‌స్తుతం సునీల్ హీరోగానే కాక క‌మెడీయ‌న్‌గా ప‌లు సినిమాల‌లో న‌టిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: