తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయదళపతి విజయ్.  ఇప్పుడు విజయ్ నటించిన ఏ సినిమాకైనా మంచి మార్కెట్ ఉంది. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'సర్కార్' చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ చిత్రంలో విజయ్ సరసన అందాల భామ కీర్తి సురేష్ నటిస్తుంది.  వీరి కాంబినేష్ లో ఇది రెండో చిత్రం అని చెప్పొచ్చు. 
Image result for hero vijay sarkar
ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే  ఈ చిత్రంలో విజయ్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడట.  మొదటి సారిగా రాజకీయ నాయకుడిగా..అందులోనూ ముఖ్యమంత్రి పాత్రలో నటించడంతో ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది.   సమకాలీన రాజకీయాలను గురించి ప్రస్తావిస్తూ, యూత్ ను ప్రభావితం చేసే విధంగా ఆయన పాత్రను తీర్చిదిద్దారని తెలుస్తోంది.
Image result for keerthi suresh
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా రాధారవి కనిపిస్తారట. ఈ ఇద్దరికీ మధ్య జరిగే వార్ ఉత్కంఠభరితంగా ఉంటుందని చెబుతున్నారు.  గతంలో లీడర్ లో రానా,  ఈ మద్య కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రల్లో నటించారు.   ఇక అదే తరహా పాత్రలో విజయ్ కూడా సంచలన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి మరి.   


మరింత సమాచారం తెలుసుకోండి: