‘హలో’ మూవీ ఘోరమైన ఫ్లాప్ తరువాత అఖిల్ అక్కినేని లేటెస్ట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈమూవీ కథలోని అఖిల్ పాత్ర పై 1971లో విడుదలై సంచలనాలు సృష్టించిన అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రేమ్ నగర్’ ఛాయలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. 

‘ప్రేమ్ నగర్’ మూవీలో అక్కినేని పోషించిన ప్లే బాయ్ తరహాలో ఎవర్నీ లెక్కచేయకుండా అహంకారంతో తిరిగే పాత్రలా అఖిల్ పాత్ర కూడ వెంకీ అట్లూరి డిజైన్ చేసాడని టాక్. ఇప్పటి తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈసినిమాలోని అఖిల్ పాత్ర విపరీతమైన నవ్వును తెప్పిస్తూ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యేలా అఖిల్ పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. 
Akhil Akkineni at Premam Telugu Movie Audio Launch Photo 3
ఈసినిమాలో అఖిల్ చాల నిర్లక్ష్యంగా కనిపిస్తూ చివరికి తనకు నచ్చిన అమ్మాయి ఎదురు పడటంతో తన పద్ధతి మార్చుకుని ఆఅమ్మాయి మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేస్తాడు అని వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో అఖిల్ పాత్రను చూసే వారికి ఖచ్చితంగా ఆనాటి అక్కినేని బ్లాక్ బస్టర్ ‘ప్రేమ్ నగర్’ గుర్తుకు వస్తుందని అంటున్నారు. 

అక్కినేని నాగేశ్వరావు మనవడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ పై అమ్మాయిలలో క్రేజ్ ఏర్పరచడానికి వెంకీ అట్లూరి అఖిల్ పై ఈ ప్లే బాయ్ ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలలో నటించినా కనీసపు హిట్ కూడ రాని నేపధ్యంలో ఈమూవీ సక్సస్ అఖిల్ కెరియర్ కు చాల కీలకంగా మారిన నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: