నిన్న విడుదలైన ‘పేపర్ బాయ్’ మూవీని అల్లు అరవింద్ కొనడంతో ఈమూవీలో ఎదో ఒక అద్భుతం ఉంది అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈమూవీ అటు క్లాస్ ప్రేక్షకులకు ఇటు మాస్ ప్రేక్షకులకు ఎవరికీ నచ్చని సినిమాగా మారడంతో ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈచిన్న సినిమాను అల్లు అరవింద్ కొనడం వెనుక అల్లు అర్జున్ సలహా ఉంది అన్న విషయాన్ని స్వయంగా అరవింద్ ఒక ఫంక్షన్ లో చెప్పాడు.
Paper Boy Movie Review
‘పేపర్ బాయ్’ టీజర్ అల్లు అర్జున్ కు బాగా నచ్చడంతో ఈమూవీ గురించి తనకు చెప్పడమే కాకుండా ఈమూవీ పంపిణీ బాధ్యతలు తాను తీసుకునేలా బన్నీ తనను ప్రమోట్ చేసాడు అంటూ ఈమూవీ ఫంక్షన్ లో అల్లు అరవింద్ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ అసలు విషయాన్ని లీక్ చేసాడు. అయితే ఎంతో అనుభవం ఉన్న అరవింద్
‘పేపర్ బాయ్’ విషయంలో దొరికిపోవడంలో బన్నీ సలహాలతో పాటు దీనివెనక మెహర్ రమేష్ మంత్రాంగం ఉంది అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. 
Allu Aravind To Launch Fresh Talent
ఎంతటి గొప్ప వ్యక్తిని అయినా ఒప్పించడంలో మెహర్ రమేశ్ దిట్ట అని అంటారు. ‘పేపర్ బాయ్’ విషయంలో కూడ అదే జరిగింది అని ఇండస్ట్రీ గాసిప్. ఈమూవీకి మొదటి రోజు నుంచి నెగెటివ్ టాక్ వచ్చేసింది. అటు కవితాత్మకంగా కాకుండా ఇటు మాస్ ఎలిమెంట్స్ లేకుండా ఎవరికీ అర్ధంకాని సినిమాగా ఈమూవీ మారడంతో ఈమూవీతో ఎవర్ని టార్గెట్ చేయాలని నిర్మించారో అర్ధం కాని విషయంగా మారింది.
A still from Geetha Govindam/Image from YouTube.
అయితే ఈవిషయాల పై మరికొందరు మరో విధంగా సెటైర్లు వేస్తున్నారు. ‘గీత గోవిందం’ తో అత్యంత లాభాలు అల్లు అరవింద్ కు వస్తున్న నేపధ్యంలో ఆ లాభాల వల్ల వచ్చే ట్యాక్స్ సమస్యలకు ‘పేపర్ బాయ్’ నష్టాలు సరి చేస్తాయి అంటూ మరి కొందరు అరవింద్ ను టార్గెట్ చేస్తూ జోక్ చేస్తున్నారు. అయితే ఈవారం విడుదలైన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవ్వడంతో ‘గీత గోవిందం’ హవా మరో వారం రోజులు కొనసాగే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: