అక్కినేని కోడలు సమంత సైడ్ బిజినెస్ మొదలు పెట్టడం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. పెళ్ళి తరువాత కూడ సినిమాలు ఒప్పుకుంటూ కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకుంటున్న సమంత కూరగాయల బిజినెస్ చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. అయితే సమంత ఈ సైడ్ బిజినెస్ ను హైదరాబాద్ లో కాకుండా చెన్నైలో చేసింది.
Samantha Akkineni turns vegetable seller
చెన్నైలోని ఒక ప్రముఖ సెంటర్ లోని కూరగాయల షాపుల సముదాయంలో సమంత ఉదయం నుండి సాయంత్రం వరకు సందడి చేస్తూ అక్కడకు వచ్చిన వ్యక్తులకు రకరకాల కూరలు అమ్మి లక్షల రూపాయలు సంపాదించినట్లు  వార్తలు వస్తున్నాయి. సమంతను కూరగాయల షాపులో చూసిన అభిమానులు వేలం వెర్రిగా ఆమె అమ్మిన కూరలను వేలరూపాయలలో కొనుక్కుని ఆమె క్రేజ్ ను మరొకసారి రుజువు చేసారు. 
Samantha Latest Image
అయితే సమంత ఈ సైడ్ బిజినెస్ తనకోసం కాకుండా సమాజ సేవకోసం చేసింది. ఇప్పటికే ‘ప్రత్యూష ఫౌండేషన్’ కార్యక్రమాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సమంత గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈకూరగాయల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. చిన్నారుల వైద్య ఖర్చుల నిమిత్తం జరిగిన ఓఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత చెన్నైలోని జామ్ బజార్ మార్కెట్ లో కూర్చుని కూరగాయలు అమ్మింది. 

అయితే చెన్నైలో తాను చేసిన సైడ్ బిజినెస్ వల్ల వచ్చిన డబ్బును ఏపీలో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం కృషి చేస్తున్న సంస్థకు విరాళంగా అందించింది. ఈమె ఆలోచనలు చాల బాగా ఉన్నా అంత ప్రజల వద్ద నుండి మాత్రమే వసూలు చేయకుండా సినిమాలతో కోట్లు గణిస్తున్న తన సంపాదన నుండి కనీసం కొంత మొత్తాన్ని అయినా చిన్నారుల గుండె ఆపరేషన్ ఖర్చుల కోసం ఇచ్చి ఉంటే సమంత పెద్దమనసుకు మరింత ప్రశంసలు లభించి ఉండేవి..  


మరింత సమాచారం తెలుసుకోండి: