వినాయకచావితిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘యూటర్న్’ మూవీలు చైతూ సమంతల వార్ గా మారడంతో ఇప్పుడు మీడియాలో ఈవార్ పై అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో భార్య భర్తల మధ్య వార్ గా మారిన ఈ సినిమాల ఫైట్ పై సమంత చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. 

ఒక మీడియా సంస్థ ప్రతినిధి సమంతను ఉద్దేశించి ఈవార్ కు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సమంత ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ తో తన మూవీ యూటర్న్ పోటీ పడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ ఈవిషయంలో రిలీజ్ డేట్ ను మార్చమని తాను ఈమూవీ నిర్మాతలకు అదేవిధంగా ఈమూవీ దర్శకుడు పవన్ కుమార్ కు ఎన్ని సార్లు చెప్పినా వారు పెద్దగా పట్టించుకోలేదు అన్న షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది సమంత.
Samantha Playing Journalist Role In U Turn Movie - Sakshi
అంతేకాదు ఈమధ్య కాలంలో ఏదైనా ఒక సినిమాకు చాలామంచి ఓపెనింగ్స్ రావాలి అంటే ఎదో ఒక వివాదాన్ని తమకు తామే క్రియేట్ చేసుకుంటున్న విషయాలను ప్రస్తావిస్తూ సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘యూటర్న్’ నిర్మాతలు ఈమూవీకి మంచి ఓపెనింగ్స్ రావాలి అన్న ఉద్దేశ్యంతో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా చైతన్య సినిమాతో పోటీగా వదులుతున్నారు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సమంత. 
Samantha
అయితే సమంత చేసిన ఈ కామెంట్స్ లో ఎంత వరకు వాస్తవం ఉన్నది అన్న విషయాలను పక్కకు పెడితే ఈమధ్య కాలంలో వివాదాలను సృష్టించుకున్న చాల సినిమాలు ఘన విజయాలను సాధించాయి అన్నది వాస్తవం. అయితే నిజానికి ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘యూటర్న్’ మూవీల కథలు రెండు డిఫరెంట్ జోనర్స్ కు సంబంధించి విభిన్నం కావడంతో ఈరెండు సినిమాలు ఘన విజయం సాధిస్తాయని సమంత అభిప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: