క్రియేటివ్ దర్శకుడుగా పేరుగాంచిన క్రిష్ కు బాలీవుడ్ హీరోయిన్ వల్ల అవమానం జరిగింది అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో వార్తల హడావిడి చేస్తున్నాయి. ఈవార్తలను ఇప్పటివరకు క్రిష్ ఖండించక పోవడంతో ఈవార్తలలో ఎంతోకొంత నిజం ఉంది అన్నకామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. 
క్రిష్‌ను అవమానించి బయకెళ్లేలా చేసిన కంగనా?
ఝాన్సీ లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా హిందీలో 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమాను క్రిష్ భారీ బడ్జెట్ తో తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ విషయాలతో బిజీగా ఉన్న క్రిష్ ఈసినిమాను కొద్దిగా పక్కకు పెట్టాడు అని అందరూ అనుకుంటూ ఉంటే వాస్తవానికి ఈమూవీ నుండి దర్శకుడుగా క్రిష్ ను తప్పించినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.
డైరెక్షన్, రైటింగులో కంగనా జోక్యం
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం హీరోయిన్ కంగనా రనౌత్ ప్రవర్తన వల్లనే క్రిష్ ఈమూవీని నుండి తప్పుకున్నాడని ఆమె చర్యలను అవమానంగా భావించడంతో క్రిష్ ఈమూవీ విషయాలను పట్టించుకోవడం మానివేసాడని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ‘మణికర్ణిక' సినిమా రైటింగ్ విషయంలో డైరెక్షన్ విషయంలో మితిమీరిన కంగనా జోక్యంతో అసహనానికి గురైన క్రిష్ ఈమూవీ విషయాలను పూర్తిగా మర్చిపొయాడని బాలీవుడ్ మీడియా కథనం. 
Sonu Sood, Tutak Tutak Tutiya, Sonu Sood actor, Sonu Sood film, Sonu Sood Tutak Tutak Tutiya
దీనికితోడు బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ తాను ఈ సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణం కంగనా రనౌత్ అని చేసిన కామెంట్స్ క్రిష్ తొలగింపుకు సంబంధించిన వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నయి. అయితే ఈమూవీ నిర్మాత కుమార్ జైన్ ఒకప్రకటన ఇస్తూ క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ విషయాలలో బిజీగా ఉన్ననేపధ్యంలో కొన్ని సీన్స్ కు సంబంధించి రీ షూట్ చేయవలసిన అవసరంలో కంగనా క్రిష్ ల మద్యఏర్పడిన క్రియేటివ్ అభిప్రాయభేదాల వల్ల ఈవార్తలు వస్తున్నాయని ఎట్టి పరిస్తుతులలోను ‘మణికర్ణిక’ మూవీకి క్రిష్ దర్శకుడుగా కొనసాగుతాడు అన్నక్లారిటీ ఇచ్చాడు. అయితే ఇంతవివాదానికి సంబంధించిన వార్తల హడావిడి జరుగుతూ ఉన్నా క్రిష్ తనమౌనాన్ని కొనసాగించడం వెనుక ఎదో ఒకకారణం ఉంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: