రాజమౌళి వారసుడుగా మారాడనికి ప్రయత్నిస్తున్న కార్తికేయ రాజమౌళి సినిమాలకు అన్ని విషయాలలోనూ అన్నీ తానై వ్యవహరిస్తూ ఉంటాడు. దర్శకత్వ విభాగంలో రాజమౌళి దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవడంతో పాటు సినిమా నిర్మాతగా మారాలని కార్తికేయ ఆకాంక్ష. 

ఈ పరిస్థుతులలో జగపతి బాబు కుటుంబంతో రాజమౌళి బంధుత్వం ఏర్పరుచుకోవడం హాట్ న్యూస్ గా మారింది. జగపతి బాబు అన్న వీరమాచినేని రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్ తో రాజమౌళి కొడుకు కార్తికేయ నిశ్చతార్ధం నిన్న జరిగింది. 
rajamouli son kartikeya as hero in new movie
ప్రముఖ వ్యాపార వేత్తగా పేరు గాంచిన రామ్ ప్రసాద్ సినిమా రంగంలో లేకపోయినా ఆ రంగంలోని వారందరికీ సుపరిచితులు.  పూజ కర్నాటక సంగీతంలో మంచి నిష్ణాతురాలు అవ్వడమే కాకుండా అనేక డివోషనల్ ఆల్బమ్స్ ను విడుదల చేసిన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఈ పెళ్ళి ఎంగేజ్ మెంట్ న్యూస్ ను అఖిల్ అక్కినేని తన ట్విటర్ ద్వారా బయట పెట్టాడు. 

కార్తికేయ అఖిల్ లు చాల మంచి స్నేహితులు అన్న విషయం చాల కొద్ది మందికే తెలిసిన విషయం. ఈ స్నేహం రీత్యా కార్తికేయ పెళ్లి వార్తలను అఖిల్ లీక్ చేయడమే కాకుండా పూజ తనకు రాఖీ చెల్లెలు అని చెపుతూ అఖిల్ పెట్టిన ట్విట్ తో కార్తికేయ పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి. రాబోతున్న డిసెంబర్ లో వీరిద్దరి పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. దీనితో మరో స్టార్ వెడ్డింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: