బాలీవుడ్‌ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందూ చిత్రం బ్రహ్మాస్త్ర. ప్రస్తుతం ఈ చిత్రం బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటుంది. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, మౌనీరాయ్‌లు ప్రధాన పాత్రలో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన బల్గేరియాలో ఉన్నారు.   

ఈ సందర్బాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ‘బ్రహ్మాస్త్ర’షూటింగ్ సెట్స్ కి వెళ్లడం సంచలనంగా మారింది.  రాష్ట్రపతి కోవింద్ చాలా బిజీగా ఉన్నప్పటికీ బల్గేరియా ప్రెసిడెంట్ రాదేవ్‌తో కలిసి బ్రహ్మాస్త్ర సెట్స్‌ను సందర్శించడంతో అందరో సంతోషంలో మునిగిపోయారు. 
 బల్గేరియాలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ స్పాట్‌ను ఆ దేశ అధ్యక్షుడు రాదేవ్‌తో కలిసి సందర్శించిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ ట్విటర్ ఖాతా నుంచి బ్రహ్మాస్త్ర సెట్స్‌లో తీసుకున్న పిక్స్‌ పోస్ట్ అవడం విశేషం. రణబీర్, ఆలియా సహా టీం మొత్తాన్ని కోవింద్ కలుసుకున్నారు.

‘‘ప్రెసిడెంట్ కోవింద్, ప్రెసిడెంట్ రాదేవ్‌ బ్రహ్మాస్త్ర షూటింగ్ జరుగుతున్న సోఫియా స్టూడియోను సందర్శించారు. సినిమా అనేది రెండు దేశాల మధ్య బిజినెస్, కల్చరల్ లింక్ అవుతుందని ఇరు దేశాధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేశారు’’ అని రాష్ట్రపతి కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: