నందమూరి బాలకృష్ణ నట వారసుడుగా మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి బాలయ్య అభిమానులు అంతా గత రెండేళ్లుగా ఎంతోఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో మోక్షజ్ఞ ఒకపాత్రలో కనిపిస్తాడు అన్న ప్రచారం జరిగింది. 
అందుకే
ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ లో యుక్తవయస్సు ఎన్టీఆర్  కనిపిస్తాడు అని ప్రచారం జరుగుతున్నా ఈవిషయం పై ఎటువంటి క్లారిటీ లేదు. వాస్తవానికి హీరో కొడుకు హీరో అవ్వాలని అతడి అభిమానులు ఆశించడం సాధారణ విషయం. ఇలాంటి పరిస్థుతులలో నిన్నటి రోజు జరిగిన మోక్షజ్ఞ పుట్టినరోజునాడు బాలయ్య వారసుడుకి శుభాకాంక్షలు తెలియచేస్తూ బాలకృష్ణ పి ఆర్ టీమ్ నిన్న మళ్ళీ మోక్షజ్ఞకు సంబంధించిన పాత ఫోటోలను కలిపి విడుదల చేయడం బాలయ్య అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తివేసింది. 
కనెక్ట్ అయ్యే కథతో ..
గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎక్కడా మీడియాకు కనిపించడం లేదు. బాలయ్య ఇంట్లో జరిగే ఫంక్షన్స్ లోను అదేవిధంగా బావ లోకేష్ మంత్రి అయినపుడు మోక్షజ్ఞ కనిపించినట్లు దాఖలాలు లేవు. లేటెస్ట్ గా నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు నందమూరి ఫ్యామిలీ అంతా కనిపించింది కానీ అక్కడ కూడ మోక్షజ్ఞ కనిపించలేదు. మోక్షజ్ఞ కొంతకాలం వరకు ఫిలింనగర్ ప్రాంతంలోని ఓ కేఫ్ కు రెగ్యులర్ గా వచ్చాడని గాసిప్పులు హడావిడి చేసాయి. 
Image may contain: 1 person, sunglasses
అయితే ఆసమయంలో మోక్షజ్ఞను చూసిన వారు గుర్తు పట్టలేకపోయారని బాగా లావు అయ్యాడని గాసిప్స్ హడావిడి చేసాయి. ఆతరువాత ఎవరికీ ఎక్కడా మోక్షజ్ఞ కనిపించక పోవడంతో తన లావును తగ్గించుకోవడానికి ఏదో ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లాడని కొద్దిరోజులు క్రితం ప్రచారం జరిగింది. బాలయ్య సన్నిహితులు మాత్రం ఇవన్నీ రూమర్లు మాత్రమే అనీ మోక్షజ్ఞ డాన్స్ ఫైట్స్ గుర్రపు స్వారీ నేర్చుకోవడం కోసం విదేశాలలోని ఒక ప్రముఖ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్నాడు అంటూ చెపుతున్నారు. అయితే కనీసం మోక్షజ్ఞ కొత్త ఫోటో అయినా ఎప్పటికి కనిపిస్తుంది అంటూ బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ కొత్త ఫోటో కోసం ఎదురు చూస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: