ప్రస్తుతం ‘జనసేన’ అధినేతగా తన సమయాన్ని అంతా రాజకీయాలకు మాత్రమే కేటాయించి వచ్చే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ రకరకాల కారణాలు వల్ల తన ప్రజాపోరాట యాత్రను వేగంగా జరపడంలో విఫలం అవుతూ ఉండటం పవన్ అభిమానులకు మింగుడుపడని సమస్యగా మారింది. సినిమాలకు దూరమై జనం మధ్య పవన్ తిరుగుతూ ఉన్నా పవన్ ఇమేజ్ గ్రాఫ్ అభిమానులు కోరుకున్నంత వేగంగా ఎదగలేక పోతు ఉండటంతో పవన్ సన్నిహితులు అతడికి మరో యాక్షన్ ప్లాన్ సూచించారు అని వార్తలు వస్తున్నాయి.
Pawan Kalyan latest comments on dull phase of his film career
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి మరో ఆరు నెలల గ్యాప్ ఉంది కాబట్టి పవన్ తన రాజకీయ సిద్ధాంతాలు వేగంగా జనం మధ్యకు తీసుకు వెళ్ళేవిధంగా ఏదైనా ఒక రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది అని పవన్ కు అత్యంత సన్నిహితులు పవర్ స్టార్ కు ఒకగట్టి సూచన ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.    పవన్ రాజకీయాలకు ప్లస్ అయ్యేవిధంగా సోషియోపొలిటికల్ క్యారెక్టర్ తో పవన్ ఒక సినిమా వేగంగా చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు పవన్ దృష్టికి కొందరు తీసుకు వెళుతున్నట్లు టాక్.
pawan-kalyan-katamarayudu-release-date-march-29th-2017
వచ్చే సంవత్సరం జనవరిలో విడుదలకాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్‌తో టీడీపీ వైఎస్ బయోపిక్‌ తో వైసీపీ లబ్ది పొందబోతున్న క్రమంలో ‘జనసేన’ కు  సైతం అటువంటి ఒక ఎక్స్‌పరిమెంటల్ మూవీ పవన్ నుండి వస్తే బాగుంటుందని పవన్ సన్నిహితుల అభిప్రాయం అని అంటున్నారు.  అయితే ఇలాంటి ప్రయోగం ప్రస్తుత పరిస్థుతులలో పవన్ కు ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు అని మరికొందరు పవన్ కు సూచనలు చేస్తున్నట్లు టాక్.
pawan kalyan birthday
ప్రస్తుత పరిస్థుతులలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయి ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా హిట్ అవ్వదో తలలు పండిన దర్శక నిర్మాతలకు కూడ అర్ధంకాని నేపధ్యంలో పవన్ తీయబోయే పొలిటికల్ మూవీ జనంలో సరిగ్గా చేరుకోకపోతే పవన్ ఇమేజ్ కి మరింత తీవ్ర నష్టాలు జరిగే ఆస్కారం ఉందని సన్నిహితులు పవన్ ను హెచ్చరిస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో పవన్ రాజకీయాల పట్ల మాత్రమే కాకుండా తనకు వస్తున్న సలహాల విషయంలో కూడ తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు వినిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: