విఘ్నాలకు అధిపతి అయిన గణనాధుడుని భాద్రపద శుక్ల చవితినాడు పూజించే సాంప్రదాయం యుగయుగాలుగా కొనాగుతోంది. జీవితంలో ఆయురారోగ్యాలు ప్రసాధించాలని ఎలాంటి విఘ్నాలు కలుగకుండా చూడాలని విఘ్నేశ్వరుడుని ప్రార్ధిస్తూ చేసే ఈ పూజలో అనేక ఆయుర్వేద శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. వినాయుకుడుని పత్రి పూజతో పూజించే ఆచారాన్ని మన ఋషులు ప్రవేశ పెట్టడంలో రకరకాల ఆయుర్వేద విలువలతో కూడిన వృక్షాలను పరిరక్షించే నిఘూడ రహస్యం ఉంది.
vijayaka-desibantu
అయితే మారిన కాలంలో ఇప్పుడు రకరకాల క్రోటన్ ఆకులను వినాయకుడిని పూజించే పత్రిగా మార్చి పూజించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మన పండితులు చెపుతున్నారు. ముఖ్యంగా మాచీ పత్రం – బృహతీ పత్రం – బిల్వ పత్రం –దూర్వార పత్రం – దత్తూర పత్రం వినాయకుడి పూజలో వినియోగించడం వల్ల ఉబ్బసం కీళ్ళ నొప్పులు నాడీ సంబంధ వ్యాధులు దరికి రావు అని మన పెద్దల నమ్మకం. అదేవిధంగా బదరీ పత్రం – తులసి పత్రం – చూత పత్రం – కరవీర పత్రం లను గణేష్ డుని పూజలో వినియోగించడం వల్ల మన దేహంలోని రక్త శుద్ధి జరగడమే కాకుండా మధుమేహం లాంటి వ్యాధులు కూడ నివారణ అవుతాయి అని ఆనాటి వేద కాలంలోనే మన ఋషులు చెప్పారు అంటే మన ఆయుర్వేద శాస్త్రం ఎంత ముందు చూపుతో ఉండేదో అర్థం అవుతుంది. ఇలా వినాయకుడి పూజలో ఉపయోగించే 21 రకాల పత్రాలకు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
Happy Vinayaka Chavithi
వినాయక చవితిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది ‘గరిక’ పూజ. గరికను పూజా పత్రంగా వినాయకుడు స్వీకరించడం ద్వారా ఆయన నిరాడంబరత్వాన్ని ప్రకృతి ప్రియ తత్వాన్ని సూచిస్తోంది అంటూ ఋషులు చెపుతారు. అంతేకాదు గరికకు మట్టికీ ఉన్న అన్న అనుబంధం రీత్యా వినాయకుడి ప్రతిమను మట్టితో చేసి మట్టి వినాయకుడుని పూజించడం అలనాటి వేద కాలం నుండి ఉందనీ పెద్దలు చెపుతారు. 
Astrologer described about Vinayaka chaturthi arrangements.
వినాయక చవితి నవరాత్రులలో మనం శ్రద్ధగా పూజించిన వినాయకుడుని నదిలోను లేదా చేరువులోను నిమజ్జనం చేయడం వెనుక కారణం వినాయకుడు ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి అక్కడకే వెళతాడు అన్న వేదాంత సత్యం ప్రభోధించడమే వినాయక నిమజ్జనంలోని ఆంతర్యం. గణపతి ఆరాధనతో మనిషికి జాతక రీత్యా ఏర్పడే గ్రహ దోషాలు కూడ నివారణ అవుతాయి అని జ్యోతిష్కులు కూడ చెపుతున్న పరిస్థుతులలో మనిషి వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా వినాయక చవితి నాడు వినాయక పూజ చేయకుండా ఉండలేడు అన్నది వాస్తవం..  



మరింత సమాచారం తెలుసుకోండి: