ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే మ్యానియా నడుస్తోంది. వాస్తవానికి నటిగా ఇప్పటివరకూ తనను తాను ప్రూవ్ చేసుకునే పాత్రలో ఆమె నటించి మెప్పించలేకపోయినా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. ఒకేసారి జూనియర్ మహేష్ ప్రభాస్ లతో కలిసి నటిస్తూ ఇదిచాలదు అన్నట్లుగా బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ తో కూడ ప్రస్తుతం ఈమె భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఆమె క్షణం తీరిక లేకుండా మహేష్ జూనియర్ ల మధ్య పరుగులు తీస్తున్న ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహేష్ ‘మహర్షి’ మూవీ అదేవిధంగా జూనియర్ ‘అరవింద సమేత’ షూటింగ్ లు చాలవేగంగా సమాంతరంగా జరుగుతున్న నేపధ్యంలో పూజా హెగ్డే కు ఒక సమస్య వచ్చి పడింది. 
Pooja Hegde Latest Hot Photos
ఈమూవీలతో పాటుగా ప్రస్తుతం ఈమె బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ‘హౌస్ ఫుల్ 4’ లాంటి క్రేజీ మూవీలో కూడ నటిస్తోంది. అక్షయ్ కుమార్ మూవీ షూటింగ్ రాజస్థాన్ లోని జై సల్మేర్ లాంటి విమాన సౌకర్యం లేనిచోట జరుగుతోంది. అక్కడికి ఒకే ఒక్క ఫ్లైట్ అందుబాటులో ఉంటుందట. 
Beautiful Pooja Hegde New Still from Duvvada Jagannadham
దీనితో అక్షయ్ కుమార్ తో నటిస్తూ మరుసటిరోజు జూనియర్ సినిమాకు కానీ మహేష్ సినిమాకు కానీ సంబంధించిన షూటింగ్ బ్రేక్ పడకుండా అందుకోవడానికి ఒకొక్కసారి పూజా హెగ్డే తన సొంత ఖర్చుతో ఏకంగా ప్రవేట్ జెట్ ను బుక్ చేసుకుని జూనియర్ ‘అరవింద సమేత’ షూటింగ్ స్పాట్ కు వస్తోందట. దీనితో పూజా హెగ్డే కమిట్ మెంట్ చూసి జూనియర్ మహేష్ లు కూడ ఆశ్చర్య పడినట్లు టాక్. ఈమెకు ఇంత మంచి పేరు వస్తోంది కాబట్టే ఇప్పుడు టాప్ హీరోలు అంతా పూజా హెగ్డే ను కోరుకుంటున్నారు అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: