చిన్నచిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే రాజమౌళి గతంలో చాల చిన్నసినిమాలు మంచివి అంటూ చేసినప్రచారం తెలిసిందే. అయితే రాజమౌళి గతంలో ప్రచారం చేసిన చాలచిన్న సినిమాల గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో రాజమౌళి అనవసరంగా కొన్ని సినిమాలను ప్రమోట్ చేసి తన గౌరవాన్ని తనకు తానుగా తగ్గించుకుంటున్నాడా అంటూ కొందరు రాజమౌళి పై నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం కూడ తెలిసిందే. 
C/o Kancharapalem
దీనితో ఒక చిన్నసినిమాను విడుదలకు ముందు రాజమౌళి మెచ్చుకుంటే చాలు ఆమూవీ ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ మొదలైంది. అయితే ‘C/o కంచరపాలెం’ విషయంలో రాజమౌళి సెంటిమెంట్ ఎమాత్రం ప్రభావం చూపెట్టకుండా అతి చిన్న సినిమాగా విడుదలైన ఈమూవీ ఇండస్ట్రీ షాకింగ్ హిట్ గా మారింది అని వార్తలు వస్తున్నాయి. 
Rana Seals C/O Kancharapalem Release Date
వాస్తవానికి ఈసినిమాను ప్రశంసిస్తూ రాజమౌళి సుకుమార్ లాంటి పెద్ద దర్శకులు ప్రశంసలు కురిపించినా ఎక్కడో చిన్న అనుమానం ఉండటంతో నిర్మాత సురేశ్ బాబు ఈమూవీని మన ఇరు రాష్ట్రాలలోను చాల తక్కువ సింగిల్ ధియేటర్లలో విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే విమర్శకుల నుండి మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి కూడ ఈమూవీకి విపరీతమైన స్పందన రావడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. 
Care of Kancharapalem
ప్రస్తుతం ఓవర్సీస్ లో కూడ కలక్షన్స్ దుమ్ము రేపుతున్న ‘కంచరపాలెం’ హడావిడి చూసిన విశ్లేషకులు మాత్రం ఇదికేవలం ఒకచిన్న సినిమా విజయంగా చూడ కూడదనీ మారిపోయిన ప్రేక్షకుల అభిరుచికి నిదర్శనంగా ఈమూవీ విజయాన్ని చూడాలని కామెంట్ చేస్తున్నారు. అయితే వీకెండ్ పూర్తి కావడంతో ‘కంచరపాలెం’ కు అసలు పరీక్ష ఈరోజు ప్రారంభం అవ్వబోతోంది. ఎటువంటి హాలీడే లేని ఈరోజు కూడ ‘C/o కంచరపాలెం’ నిలబడగలిగినా మరో మూడు రోజులలో రాబోతున్న ‘శైలజా రెడ్డి’ ‘యూటర్న్’ మూవీల పోటీని ఎంతవరకు తట్టుకుని ఈ చిన్న సినిమా నిలబడ గలుగుతుందీ అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: