దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరూపాయి ఖర్చు పెట్టవలసిన చోట తాను 10రూపాయలు ఖర్చు పెడతానని ఈఅలవాటు తన చిన్నతనం నుండి వచ్చిందని త్రివిక్రమ్ ఆమధ్య ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఈఅలవాటు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాల విషయంలో కూడ కొనసాగుతూ ఉండటంతో త్రివిక్రమ్ టాప్ హీరోలతో తీస్తున్న సినిమాల బడ్జెట్ ఊహించిన దానికి రెట్టింపు అవుతూ నిర్మాతలకు చుక్కలు చూపెడుతోంది. 
Jr NTR in Aravinda Sametha
ఇలాంటి పరిస్తుతులతో త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ కోసం తీసిన షూటింగ్ లో కేవలం ఒకచెట్టు ఆకుల కోసం 25లక్షలు ఖర్చుపెట్టిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘అరవింద సమేత’ లో ఒక సీన్ ఉందట ఆసీన్ లో రెండు చెట్లు కనిపిస్తాయి ఒకచెట్టు ఎండిపోయి ఉంటే మరొక చెట్టు నిండుగా ఆకులతో ఉంటుంది. 

ఈమూవీ కథకు సంబంధించి తీసిన కీలక సన్నివేశంలో సింబాలిక్ గా బ్యాక్ గ్రౌండ్ లో ఈచెట్లను చూపెట్టే ప్రయోగం త్రివిక్రమ్ చేసినట్లు టాక్. ఈసీన్ చిత్రీకరణ మండు వేసవిలో చేసిన నేపధ్యంలో ఆకులతో పూర్తిగా నిండి ఉన్న చేట్టుకోసం అన్వేషణ ఫలించక పోవడంతో ఒక ఆర్టిఫిషియల్ భారీ చెట్టు ఏర్పాటు చేసి అందుకోసం భారీ సంఖ్యలో ప్లాస్టిక్ ఆకులు చెన్నయ్ నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. 
jr ntr aravinda sametha satellite rights gets record price
అయితే ఈ క్రియేటివ్ ఆలోచనకు సుమారు 25లక్షలు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈసీన్ చిత్రీకరిస్తున్నప్పుడు సమ్మర్ లో బలమైన గాలులు వీయడం మధ్యలో ఆకులు చెట్టుకు అతికించిన ఆకులు రాలిపోవడం అనేక సార్లు జరిగిందట. ఈవిషయాలు అన్నీ ఇప్పుడు బయటకు రావడంతో త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ లో తాను గతంలో ‘అత్తారింటికి దారేది’ లో చూపెట్టిన బ్రహ్మానందం చెట్టు ఆకుల సీన్ మళ్ళీ రిపీట్ చేసాడా అంటూ కొందరు జోక్స్ వేసుకుంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: