నాగచైతన్య ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో తన అభిమానులతో ట్విటర్ ద్వారా ఛాట్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖ హీరోల పై తన అభిప్రాయాలను ఎటువంటి మొహమాటం లేకుండా చాల స్పష్టంగా తెలియచేసాడు. ముఖ్యంగా ఈ సందర్భంలో చైతన్య పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. 
Image may contain: 1 person, standing and suit
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం స్ఫూర్తి దాయకం అంటూ ఎవరైనా పవన్ వ్యక్తిత్వాన్ని చూసి స్ఫూర్తి పొందడం ఖాయం అని అంటున్నాడు. అంతేకాదు మహేష్ బాబు నిజమైన సూపర్ స్టార్ అంటూ మహేష్ అభిమానుల ప్రాపకం పొందడానికి కూడ తనవంతు ప్రయత్నం చేసాడు. 
Image may contain: 1 person
ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ నుంచి తాను ఎంతో నేర్చుకోవాలి అంటూ విజయ్ అభిమానులను కూడ బుట్టలో పడేస్తున్నాడు చైతన్య. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ  ప్రతి సినిమాకు బెటర్ అవుతూ వస్తున్న అతని కృషి తనకు ఆదర్శప్రాయం అంటూ కామెంట్స్ చేసాడు. అయితే స్టార్ హీరోల కుటుంబం నుండి వచ్చిన చైతన్య అభిమానించే హీరో మన తెలుగు ఇండస్ట్రీలో లేడు. చైతూ కోలీవుడ్ హీరో అజిత్ వీరాభిమానిని అని చెపుతున్నాడు. 
Naga Chaitanya, Naga Chaitanya Controversial Comments Premam Malayalam, Naga Chaitanya Controversial Comments Malayalam Premam, Naga Chaitanya Controversial Comments Original Premam, Naga Chaitanya Comments Original Premam
అయితే చైతన్య మరో ట్విస్ట్ ఇస్తూ సమంత తన జీవితంలో సూపర్ స్టార్ అని చెపుతూ మహేష్ ట్యాగ్ ను సమంతకు ట్రాన్స్ఫర్ చేసాడు. ఇక జూనియర్ ఎంపిక చేసుకునే పాత్రలు తనకు ఎంతో ఇష్టం అని చెపుతూ తన తమ్ముడు అఖిల్ తన జీవితంలో ఒక భాగం అని చెపుతూ రానాను తన లైఫ్ సపోర్ట్ పిల్లర్ గా పేర్కొన్నాడు. ఇలా అందరి టాప్ హీరోలను టచ్ చేయడమే కాకుండా వారి గురించి ప్రశంసలు కురిపిస్తూ రేపు విడుదలకాబోతున్న తన ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీని యంగ్ హీరోల అభిమానులందరూ చూసేలా వ్యూహాత్మకంగా కామెంట్ చేసిన చైతన్య తెలివితేటలను చూసిన వారు చైతూ బాగా రాటు తేలాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: