తెలుగు ఇండస్ట్రీలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం మహానటులు ఎన్టీఆర్ జీవితంలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో చూపించబోతున్నారట దర్శకులు క్రిష్.  ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పాత్రల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. 

 రానా దగ్గుపాటి

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్..ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు, సీఎం చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా, శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్ ఇంకా మరికొన్ని ముఖ్యపాత్రలో సీనియర్ నటీ,నటులను తీసుకున్నట్లు సమాచారం. కాగా,   ‘ఎన్టీఆర్' బయోపిక్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

 ఎన్టీఆర్ లుక్‌లో బాలయ్య

ఇప్పటికే ఎన్టీ రామారావుగా బాలకృష్ణ, చంద్రబాబునాయుడుగా రానా ఫస్ట్ లుక్స్ బయటకు రావడంతో..మూవీపై ఇటు రాజకీయ వర్గాలు, అటు సినీ అభిమానాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే రానా లుకింగ్ పై రక రకాల కామెంట్స్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి బరిలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: