తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కామెడీ దర్శకుడిగా మారుతి మంచి పేరు తెచ్చుకున్నాడు.  రిసెంట్ గా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘శైలాజారెడ్డి అల్లుడు’ మిశ్రమ స్పందన తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ..తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాకియి వచ్చానని అంటున్నారు.  నేను .. యూవీ క్రియేషన్స్ వంశీ .. బన్నీవాసు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్లం. ముందుగా ముగ్గురం కలిసి 'ఆర్య' సినిమా కొన్నాము. ఆ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో ఆ తరువాత 'హ్యాపీ' సినిమాను కొంటే నష్టాలను తెచ్చిపెట్టింది. 


ఈ రోజుల్లో .. బస్టాప్ వంటి చిత్రాలకు విమర్శలు ఎదురైన మాట వాస్తవమే. అయితే బూతులు పెట్టడం వల్లనే సినిమాలు హిట్ అవుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు .. అలా ఆలోచించలేదు. యూత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాను. హిట్లు వస్తున్నాయి .. డబ్బులు వస్తున్నాయి కదా అని అదే తరహా సినిమాలు చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు.


తర్వాత కాలంలో నా స్టైల్ మార్చాను..సుదీర్ బాబు తో ‘ప్రేమ కథాచిత్రమ్’ తో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఆ తరహా చిత్రాలైనే ఎక్కువ ఫోకస్ పెట్టాను. అల్లు అర్జున్ నటించిన 'హ్యాపీ' చిత్రం కొంటే నష్టాలను తెచ్చిపెట్టింది.'మహా' .. 'నందనవనం 120 కిలోమీటర్స్' చిత్రాలతో డబ్బంతాపోయింది. ఇంకొద్దురా బాబోయ్ ఈ సినిమా బిజినెస్ మనకి వద్దు అనే స్థితికి వెళ్లిపోయాను. అందుకే ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను..మళ్లీ ఇలాంటి పనులు చేయొద్దని ఖర్చితమైన నిర్ణయం తీసుకున్నాని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: