తెలుగు ఇండస్ట్రీలో యూత్ ఐకాన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా న‌టించిన మూవీ నోటో విడుద‌ల వాయిదా ప‌డింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ మూవీ అక్టోబ‌ర్ నాలుగో తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఈ మూవీ ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ గ‌తంలోనే వెల్ల‌డించాడు.. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కాక‌పోవ‌డంతో ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18 వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.‘గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' పై అందరి దృష్టి పడింది. 


'గీత గోవిందం' తర్వాత 'టాక్సీవాలా' రిలీజ్ కావలిసి ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయిందంటూ 'నోటా' ను ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్లతో ఇప్పటికే 'నోటా' పై అంచనాలు భారీగా పెరిగాయి.  ఇక ఈ సినిమాను అక్టోబర్ 4 న రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 18 కు రిలీజ్ డేట్ మార్చారట. తెలుగు — తమిళ వెర్షన్స్ అదే రోజు దసరా సందర్భంగా రిలీజ్ అవుతాయట.


దీంతో ఈ డేట్ కు ఆల్రెడీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న రామ్ 'హలో గురు ప్రేమ కోసమే'.. విశాల్ 'పందెం కోడి 2' కు భారీ పోటీ ఎదురు కానుంది. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న హీరోపై అంత కాన్ఫిడెన్స్ ఉంచుకోవడం కూడా సరైన పద్దతి కాదని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం.  దసరా రోజుల్లోనే స్టారోల చిత్రాలు వస్తున్నాయి. కాగా, ఈ మూవీలో విజ‌య్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. 


ఇక నోటా చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన  మెహ్రీన్ కౌర్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో లో నాజర్ - సత్యరాజ్ లు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ మొదటి సారి కోలీవుడ్ లో తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకోబోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: