జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రాబోతున్న  ‘అరవింద సమేత’ పాటలు మరో రెండురోజులలో సెప్టెంబర్20న డైరెక్ట్ గా యూట్యూబ్ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. హరికృష్ణ అకాల మరణంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు మళ్ళీ  ఆమూవీ షూటింగ్ ను శరవేగంతో పూర్తి చేస్తోంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన మొదటిపాటను విడుదలచేసారు. 
Only Two Duets In Aravindha Sametha
హీరోయిన్ అరవింద పాత్రను వర్ణిస్తూ ఆమె ప్రేమకోసం రాఘవుడు ఎంతగా తపించిపోతున్నాడో సిరివెన్నెల సాహిత్యంతో తమన్ స్వరపరిచిన ట్యూన్ కు రెస్పాన్స్ బాగా వచ్చింది. అయితే ఇంతలో ఈమూవీకి సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఆడియో ఆల్బంలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉంటాయట. 
Jr NTR in Aravinda Sametha
అందులోనూ డ్యూయెట్స్ రెండు అని తెలుస్తోంది. దీనికితోడు ఉన్న నాలుగు పాటల్లో రెండు డ్యూయెట్స్ పోగా మిగిలిన వాటిలో ఒకటి సోలో సాంగ్ కాగా బ్యాలన్స్ ఉన్న చివరిపాట బ్యాక్ గ్రౌండ్ లో  వచ్చే థీమ్ సాంగ్ గా చెబుతున్నారు. ఈ థీమ్ సాంగ్ ముక్కలు ముక్కలుగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల వెనుక వాయస్ ఓవర్ బదులుగా వస్తుందని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి ఫారిన్ షెడ్యూల్ లో మరో పాటను అనుకున్నప్పటికీ టైం లేదు కాబట్టి అనవసరంగా రిస్క్ చేయటం ఎందుకని త్రివిక్రమ్ మరో డ్యూయెట్ పాటకు సంబంధించి ఆలోచనలు విరమించినట్లు తెలుస్తోంది. 
Naveen Chandra in 'Aravinda Sametha'
దీనితో ఈమూవీ ఆడియోను కేవలం నాలుగు పాటలకే పరిమితం చేసారని తెలుస్తోంది. జూనియర్ సినిమాలకు ప్రధాన బలమైన డాన్సులు ఈసినిమాలో కేవలం రెండు పాటలకే పరిమితమవుతాయన్న మాటలు వినిపిస్తున్నాయి. మొన్న రిలీజ్ అయిన ఈమూవీ మొదటి పాట మెలోడీగా ఉన్న నేపధ్యంలో మాస్ కి వెర్రెక్కించే స్టెప్స్ ఉండకపోవచ్చు దీనితో జూనియర్ డాన్స్ విశ్వరూపం మిగిలి ఉన్న మరొక్క పాటలోనే చూసే ఆస్కారం ఉంది. ‘అరవింద సమేత’ పాటలకు మాస్ ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాకపోతే తమ పరిస్థితి ఏమిటీ అంటూ ఈమూవీని ఇప్పటికే అత్యంత భారీరేట్లకు కొనుక్కున్న బయ్యర్లు భయపడి పోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: