బాలకృష్ణ ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్నా మేకప్ వేసుకుంటే చాలు ఆపాత్రలో లీనమైపోయి యంగ్ హీరోలతో సమానంగా మారిపోతాడు. ముఖ్యంగా హీరోయిన్స్ తో రోమాన్స్ విషయంలో బాలకృష్ణ దూకుడు తట్టుకోవడం కష్టమని చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చెపుతూ జోకులు వేస్తూ ఉంటారు.
Star power was in abundance on the second day of the SIIMA Awards held in Dubai on Saturday. (Photos: Viral Bhayani/ Twitter)
ఇలాంటి నేపధ్యంలో దుబాయిలో జరిగిన ‘సైమా’ అవార్డు వేడుకలు తరువాత జరిగిన ఒక అర్దరాత్రి పార్టీలో బాలకృష్ణ తీరును చూసి ఆపార్టీకి వచ్చిన చాలమంది సెలెబ్రెటీలు ఆశ్చర్యపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి ఉత్తమ హీరో అవార్డును అందుకునేందుకు దుబాయి వెళ్లిన బాలకృష్ణ అక్కడి వారిని తన ఉత్సాహంతో సర్ ప్రైజ్ చేశాడు. రెండు రోజులపాటు జరిగిన అవార్డు వేడుకల ముగింపు సందర్బంగా సౌత్ సినీ సెలబ్రెటీలందరికి కూడా ‘సైమా’ నిర్వాహకులు పెద్ద పార్టీ ఇవ్వడం జరిగింది. 

ఆపార్టీ రాత్రి 12 గంటల నుండి తెల్లవారుఝామున వరకు కొనసాగినట్లుగా తెలుస్తోంది. సైమా నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో బాలకృష్ణ చాలా జోవియల్ గా పాల్గొన్నాడమే కాకుండా అందరితో కలిసి సరదాగా జోక్స్ వేస్తూ ఆపార్టీలో తెగ సందడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం పెద్ద హీరోలతో మాత్రమే కాకుండా చిన్న నటీనటులతో యంగ్ హీరోయిన్స్ తో బాలకృష్ణ సినిమా షూటింగ్ సమయాలలో అదేవిధంగా పార్టీలలో కలిసిపోతాడు అన్నమాటలు ఎప్పటినుంచో ఉన్నాయి. తనతో నటించే హీరోయిన్స్ చేత ‘సార్’ అని పిలిపించుకోకుండా ‘బాల’ అని పిలిపించుకోవడం బాలకృష్ణకు ఎంతో ఇష్టమైన ఇష్టం.  

‘సైమా’ పార్టీలో ఎంజాయ్ చేయడమే కాకుండా బాలయ్య డాన్స్ లు  కూడా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సైమా వేడుకల్లో పాల్గొన్న హీరోయిన్స్ శ్రియ ప్రగ్యా జైస్వాల్ అంజలి లాంటి పలువురు హీరోయిన్స్ తో బాలకృష్ణ డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈపార్టీలో బాలయ్య చేసిన హంగామా చూసి చాలామంది తమిళ కన్నడ హీరోలు ఆశ్చర్యపోయారు అంటే బాలయ్య హడావిడి ఏరేంజ్ లో జరిగిందో ఊహించుకోవచ్చు..   



మరింత సమాచారం తెలుసుకోండి: