‘బిగ్ బాస్ 2’ సీజన్ ముగింపు దశకు చేరుకావడంతో ఈషో విజేతలుగా కౌశల్ గీతా మాధురిలలో ఎవరు ఫైనల్ విజేత అవుతారు అన్నవిషయం పై బుల్లితెర ప్రేక్షకులు ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈషో ముగింపుకు రాబోతున్న నేపధ్యంలో కౌశల్ ఆర్మీ కౌశల్ ను విజేతగా మార్చాలని విపరీతంగా ప్రమోట్ చేస్తోంది.  
సిసలైన డైరెక్టర్ కంట్లో
ప్రస్తుతం కౌశల్ కు లభిస్తున్న క్రేజ్ ఒకటాప్ హీరో స్థాయికి చేరిపోవడంతో ఆ క్రేజ్ ఎలా వచ్చిందో ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. ‘బిగ్ బాస్’ హౌస్ లో కౌశల్ చూపిస్తున్న నిజాయతీ అతడిని ఈస్థాయికి తీసుకువచ్చింది అని విశ్లేషకుల అభిప్రాయం. కౌశల్ పై ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయాపాటి శ్రీను దృష్టి పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 
దశ మారినట్లే
తెలుస్తున్న సమాచారం మేరకు బోయపాటి బాలకృష్ణతో వచ్చేసంవత్సరం మొదలు పెట్టబోయే భారీ మూవీలో కౌశల్ ను విలన్ గా మార్చి ఇండస్ట్రీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే బోయపాటి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఒకకీలక వ్యక్తిని కౌశల్ భార్య దగ్గరకు పంపించి ఈవిషయమై ప్రాధమిక చర్చలు జరిపినట్లు సమాచారం. కౌశల్ మ్యానియా గురించి బాలకృష్ణకు సూచన ప్రాయంగా బోయపాటి చెప్పి బాలయ్య అంగీకారంతో ఈ పనులకు శ్రీకారం చుట్టినట్లు టాక్. 
క్రేజీ సెలెబ్రిటీలుగా
ఈవార్తలే నిజం అయితే ‘లెజెండ్’ సినిమాతో జగపతి బాబుకు బ్రేక్ వచ్చినట్లుగా బోయపాటి బాలయ్యల కొత్త సినిమాతో కౌశల్ కు కలలో కూడ ఊహించని బ్రేక్ రావడం ఖాయం అనుకోవాలి. ఇప్పుడు ఈవార్తలు వైరల్ గా మారడంతో కౌశల్ ఆర్మీ మరింత రెచ్చిపోయి ‘బిగ్ బాస్ సీజన్ 2’ విన్నర్ గా కౌశల్ ను మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తారు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు..   



మరింత సమాచారం తెలుసుకోండి: