ఆ మద్య కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’చిత్రంలో రవితేజ, సంగీత ఒక్క సినిమా ఛాన్స్ ఇస్తే మేమేంటో నిరూపిస్తాం అంటూ..స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు.  ఇక నిజజీవితంలో సైతం ఎంతో మంది ఔత్సాహికులు తమకు ఒక్క ఛాన్స్ ఇప్పిస్తే తామేంటో నిరూపించుకుంటాం అంటూ స్టూడియోల వెంట తిరుగుతుంటారు..అలా తిరిగే వారి బలహీనతను కొంత మంది బ్రోకర్లు క్యాష్ చేసుకుంటారు.  ఇక అమ్మాయిలను అయితే బ్రోకర్లు దారుణంగా మోసం చేస్తున్నారు.  అయితే సినిమా ప్రపంచం అంటే రంగుల ప్రపంచం..అందుకోసం దేనికైనా తెగిస్తుంటారు ఔత్సాహిక కళాకారులు.

మరికొంత మంది తాము కన్న కలలు నెరవేరలేదని..తమ కుటుంబీకులకు ముఖం చూపించలేమని ఆత్మహత్యలు చేసుకున్నవారుకూడా ఉన్నారు.  తాజాగా  హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పదంగా మృతిచెందాడు.  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మంగా టిఫిన్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న హృదయ లాడ్జిలో అర్జున్‌ గౌడ్‌ (30) అనే యువకుడు, గత 20 రోజులుగా రూము అద్దెకు తీసుకుని ఉంటూ, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు. 

కాగా, నిన్న రాత్రి షూటింగ్ ముగించుకొని లాడ్జికి వచ్చిన అర్జున్ గౌడ్, కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు. ఎందుకు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావని తన ఫ్రెండ్  నాగ కార్తీక్ అడిగాడు..అందుకు తనకు విపరీతంగా దగ్గు వస్తుందని..అందుకోసమే ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నానని అన్నాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: