తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ మూర్తి అయ్యే సమయం వచ్చింది.  బిగ్ బాస్ సీజన్ 2 కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  మొదట్లో బిగ్ బాస్ సీజన్ పై విమర్శలు వెల్లివెత్తాయి.  రాను రాను బిగ్ బాస్ హౌజ్ లోని టాస్కులు, ఎలిమినేషన్, వీక్ ఎండ్ లో నాని చేస్తున్న గేమ్ షోలు కనువిందు చేస్తూ వస్తున్నాయి.  ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సభ్యుల్లో మోడల్, నటుడు కౌశల్ కి ప్రత్యేక ఇమేజ్ సంతరించుకుంది.  ఏకంగా మనోడికి కౌశల్ ఆర్మీ అంటూ ప్రచారం కూడా జరుగుతుంది.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ అంటూ దుమ్మురేపుతున్నారు.  ఒక సామాన్యుడికి ఇంత క్రేజ్ రావడం ఏంటీ అంటూ ఇండస్ట్రీ వర్గంలో కూడా చర్చలు మొదలయ్యాయి.  బిగ్ బాస్ హౌస్' లో ఒక సభ్యుడిగా కనిపిస్తూనే తనదైన స్టైల్ తో ఆయన కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్నాడు. 'బిగ్ బాస్ 2' పూర్తయిన తరువాత కౌశల్ కి వరుస సినిమా ఛాన్సులు వచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.  కౌశల్ కి మంచి చాన్స్  ఇవ్వడానికి దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ముఖ్యంగా కౌశల్ పై దర్శకుడు బోయపాటి శీను దృష్టిపెట్టినట్టుగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. త్వరలో బాలకృష్ణతో తీయబోయే చిత్రంలో  కౌశల్ కి విలన్ పాత్ర కానీ..నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర కాని ఇవ్వాలని ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తుంది.  ఇప్పటికే బోయపాటి టీమ్ కౌశల్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి..ఆ మద్య లెజెండ్ చిత్రంలో జగపతిబాబు కి విలన్ పాత్ర ఇచ్చిన విషయం తెలిసిదే..అప్పటి నుంచి ఇప్పటి వరకు జగపతిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: