‘సైరా నరసింహా రెడ్డి’ టీమ్  ప్రస్తుతం జార్జియాలో ఉన్న సంగతి తెల్సిందే. అత్యంత భారీస్థాయిలో యుద్ధసన్నివేశాల చిత్రీకరణ కోసం రంగం సిద్ధం కావడంతో రేపటి నుంచి నిర్విరామంగా ఈమూవీ షూటింగ్ జరగబోతోంది. దర్శకుడు సురేంద్ర రెడ్డి ఈమూవీ విషయంలో చేసిన ఒక చిన్నపొరపాటు చిరంజీవికి అనుకోని సమస్యగా మారింది అని అంటున్నారు. చిరంజీవి ‘సైరా’ షూటింగ్ ప్రారంభానికి ముందు భుజానికి సర్జరీచేయించుకున్నాడు. 
megastar chiranjeevi starrer sye raa narasimha reddy teaser released
ఆసర్జరీ తరువాత ‘సైరా’ షూటింగ్ మొదలు కావడం ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ పాత్రకు సంబంధించి ముందుగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీయకుండా యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగించాడు సురేంద్ర రెడ్డి. ఈసీన్స్ చిత్రీకరణ పూర్తి అయితే ఆ యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ఒక వైపు కొనసాగుతూ ఉంటే మరొక వైపు నరసింహా రెడ్డి యూత్ లుక్ కు సంబంధించిన సీన్స్ తీయలనుకున్నాడట సురేంద్ర రెడ్డి. 
sye raa narasimhareddy teaser: an epic in the making!
అయితే చిరంజీవికి జరిగిన భుజం సర్జరీ వల్ల చిరంజీవి రోజువారీగా చేసే ఎక్సర్ సైజులకు తాత్కాలికంగా విరామం ఇచ్చేసాడట. దీనితో బరువు పెరగడం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈసినిమాకు సంబంధించి నరసింహరెడ్డి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో ఉండే ఎపిసోడ్స్ లో చిరు లుక్ పరంగా యంగ్ గా కనిపించాలి కాబట్టి ఇప్పుడు చిరంజీవి వెంటనే భారీగా ఎక్సర్ సైజులు చేసి సన్నబడే అవకాసం లేదు అని అంటున్నారు. 
Chiranjeevi Sye Raa Narasimha Reddy Teaser Launch - Sakshi
దీనితో ఈ సమస్యను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయంలో ‘సైరా’ టీమ్ తర్జనభర్జన పడుతున్న పరిస్థుతులలో వారికి ‘బాహుబలి’ లో అనుష్కకు ఉపయోగించిన ఫార్మలా గుర్తుకు వచ్చినట్లు సమాచారం. ‘సైజ్ జీరో’ తో అనుష్క విపరీతంగా బరువు పెరిగిపోవడంతో ‘బాహుబలి 2’ కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో రాజకుమారిగా అనుష్కను నాజూకుగా చూపెట్టడానికి రాజమౌళి గ్రాఫిక్స్ ప్రయోగాన్ని ఉపయోగించాడు.  ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సురేంద్ర రెడ్డితో కలిసి ఈ విషయంలో చాలా కేర్  తీసుకుంటూ ఇప్పుడు అదే ప్రయోగం చేయబోతున్నట్లు టాక్. ఏమైనా ‘సైరా’ తో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న తపనతో చిరంజీవి చాల కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: