ఈరోజు ముస్లిమ్ లు అత్యంత పవిత్రంగా జరుపుకునే మొహరం పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గా వద్ద  జరిగే రొట్టెలు విసిరీ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ ఆలీ ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. జరుగుతున్న లేటెస్ట్ పరిణామాలను పరిశీలిస్తున్న వారు అలీ త్వరలో ‘జనసేన’ లో చేరబోతున్నాడా అంటూ అప్పుడే ఊహాగానాలు కూడ మొదలు పెట్టేసారు. 
pawan-kalyan-selfie-with-sardaar-gang-ali-brahmaji-gujarat-hyderabad-new-pics
వాస్తవానికి అలీకి ఎప్పటినుంచో రాజకీయ ఆశక్తి ఉన్న నేపధ్యంలో గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతాడు అన్న వార్తల ప్రచారం కూడ జరిగింది. ముఖ్యంగా గడచిన 2014 ఎన్నికల సమయంలోనే ఆలీ తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి నుంచి గానీ గుంటూరు నుంచి గానీ పోటీ చేయబోతున్నాడు అంటూ  అప్పట్లో మీడియా వర్గాలలో విపరీతమైన ప్రచారం జరిగింది. 
Image may contain: 2 people, people smiling, indoor
అయితే ఆవార్తలు కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి.  గతంలో అలీ ఒక  మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు బాగా మిత్రుడైన పవన్ కళ్యాణ్ తనను ఆహ్వానిస్తే తాను ‘జనసేన’ లో చేరడం ఖాయం అన్న సంకేతాలు ఇచ్చాడు. ఈసంకేతాలు పవన్ దృష్టి వరకు వెళ్ళడంతో ఇప్పటికి  పవన్ అలీ ల మధ్య ఒక సయోధ్య కుదిరి ఇప్పుడు పవన్ వెంట అలీ నడవబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 
pk
ఇది ఇలా ఉండగా ఆరోగ్య కారణాల రీత్యా తన పోరాట యాత్రకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ ఇప్పుడు మళ్ళీ తన స్పీడ్ ను పెంచి కాపు సామాజిక వర్గానికి అత్యంత కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లాలో తన ప్రజా పోరాట యాత్రకు తిరిగి శ్రీకారం చుడుతున్నాడు. ఇండియా టుడే లాంటి ప్రముఖ పత్రిక పవన్ ‘జనసేన’ కు ఐదు శాతం మించి ఓట్లు రావని అంచనాలు కడుతున్నా పవన్ వ్యూహాలు మాత్రం మరింత వేగం పెరగడంతో పవన్ ఎత్తుగడలు చంద్రబాబు జగన్ లలో ఎవరికి నష్టం కలిగిస్తుంది అన్న విషయమై రాజకీయ పనితులు కూడ స్పష్టమైన అంచనాలు వేయలేకపోతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: