ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందనకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించిన ‘ఛలో’ ‘గీత గోవిందం’ సినిమాలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన నేపధ్యంలో వచ్చేవారం విడుదలకాబోతున్న ‘దేవదాస్’ కూడ హిట్ అయితే రష్మిక టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడం ఖాయం. 
Rashmika
ఇలాంటి పరిస్థుతులలో మొన్న జరిగిన ‘దేవదాస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనిపించిన రష్మిక కుడి చేతిపై ఉన్న టాటూ పై మీడియా కెమెరాల దృష్టి పడింది. దీనితో చాలమీడియా కెమెరాలు ఈఫంక్షన్ కు వచ్చిన నాగార్జున నానీలతో సమానంగా రష్మిక టాటూని ఎక్స్ పోజ్ చేస్తూ మీడియా కెమెరాలకు తెగ పని కల్పించారు.
Rashmika Mandanna. Image via Twitter/@flixpack
రష్మిక చేతిపై ఉన్న ఆ పచ్చబోట్టులో ఇంగ్లీష్ లెటర్స్ లో Irrepleceable అనే పదం ఉంది. ఈ ఇర్రిప్లేసబుల్  పదంలో చివరిగా వచ్చే ‘ఈ’ అక్షరం పైన ఒక లవ్ సింబల్ ఉంది.  ఇప్పుడు ఈటాటూలో ఉన్న అర్ధాలు ఏమిటి అంటూ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. రష్మిక తన సహా నటుడు కన్నడ ఫిలింమేకర్ అయిన రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత రష్మిక ఓపెన్ గా బయటకు వచ్చిన ఒక పెద్ద ఈవెంట్ ఇది. 
Rashmika Mandanna Latest Images
రక్షిత్ శెట్టితో బ్రేకప్ విషయం తనకు ఎంతబాధ కలిగించిందో తెలియచేయడానికే రక్షిత ఇలా ప్రవర్తించింది అంటూ కొందరు ఆమె టాటూ వెనుక అర్ధాలను వెతుకుతున్నారు. ఇర్రిప్లేసబుల్ అంటే ఇంపాజిబుల్ టూ రీప్లేస్ అని అర్ధం వచ్చే నేపధ్యంలో రష్మిక ఇలా ప్రవర్తించింది అనుకోవాలి. అయితే ఈ టాటూ ప్రభావంతో రానున్న రోజులలో రక్షిత్ శెట్టి రష్మికాలు మళ్ళీ కలిసిపోతారేమో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: