క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన ‘రౌడీ’ గార్మెంట్స్ బ్రాండ్ ను లాంచ్ చేసిన తరువాత ఆ బ్రాండ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది అని భావించాడు. వాస్తవానికి ‘రౌడీ గార్మెంట్స్’ బ్రాండ్ ఇప్పటి వరకు పూర్తిగా యూత్ కు కూడ కనెక్ట్ కాలేదు అని అంటున్నారు. 
Vijay Deverakonda replies to trolls and memes
ఇలాంటి పరిస్థుతులలో నిన్న సంపూర్ణేష్ బాబు నిన్న రాత్రి జరిగిన ‘కొబ్బరిమట్ట’ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ‘రౌడీ బ్రాండ్’ లుంగీలను కట్టుకుని ఆ ఈవెంట్ కు రావడం చాలమందిని ఆశ్చర్య పరిచింది. దీనితో సంపూ విజయ్ మ్యానియాను తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే విజయ్ బ్రాండ్ ఇమేజ్ సంపూ స్థాయికి పరిమితం అయిందా అంటూ మరొకొందరు జోక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
vijay-deverakonda-launched-his-clothing-line-rowdy-wear-images
వాస్తవానికి సినిమాలలో రాణిస్తూనే తన రౌడీ బ్రాండ్ కు ఒక కార్పొరేట్ ఇమేజ్ తేవాలని విజయ్ కలలు కంటున్నాడు. అయితే కలలకు వాస్తవానికి మధ్యన చాల గ్యాప్ ఉన్న నేపధ్యంలో విజయ్ రౌడీ టీ షర్ట్స్ కు అనుకున్నంత క్రేజ్ గార్మెంట్స్ ఇండస్ట్రీలో రాలేదు. 
NOTA Controversy Still Brewing
ఇది ఇలా ఉండగా విజయ్ తన అభిమానులకు చేసిన లేటెస్ట్ ట్విట్ సంచలనంగా మారింది. అక్టోబర్ లో విడుదల కావలసిన తన ‘నోటా’ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేయాలా లేదంటే అక్టోబర్ 12న విడుదల చేయాలా 18న విడుదల చేయాలా అంటూ ఏకంగా తన అభిమానులను ప్రశ్నిస్తూ సమాధానం చెప్పమని అడగటం విజయ్ ‘నోటా’ కు సంబంధించి అనుసరిస్తున్న మరో ఊహించని స్ట్రాటజీ..    


మరింత సమాచారం తెలుసుకోండి: