‘నోటా’ రిలీజ్ డేట్ సంబంధించి విజయ్ దేవరకొండకు కొంత అయోమయం ఏర్పడటంతో ఆమూవీ విడుదలకు సరైన డేట్ ను సూచించండి అంటూ విజయ్ తన అభిమానులకు అక్టోబర్ 5 – 10 – 18 తేదీలలో ఏతేది విడుదల అయితే బాగుంటుంది అంటూ విజయ్ దేవరకొండ చేసిన ట్విట్ జూనియర్ అభిఆనులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. ‘అరవింద సమేత’ అక్టోబర్ 12న విడుదల అవుతున్న నేపధ్యంలో తమ హీరో సినిమాతో విజయ్ దేవరకొండ పోటీ పడటం జూనియర్ అభిమానులకు మింగుడు పడని సమస్యగా మారింది.
NOTA teaser,Vijay Deverakonda,Vijay Deverakonda Movie
దీనితో కొందరు జూనియర్ అభిమానులు రెచ్చిపోతూ నిజంగా దమ్ముంటే అక్టోబర్ 10న ‘నోటా’ ను విడుదల చేయమని సవాల్ విసురుతూ ట్విట్స్ చేస్తున్నారు. మరికొందరు జూనియర్ అభిమానులైతే మరో అడుగు ముందుకు వేసి జూనియర్ ను సింహంతో పోలుస్తూ విజయ్ దేవరకొండ ‘నోటా’ ని ఒక లేడి పిల్లలా ‘అరవింద సమేత’ కు ఆహారంగా వేస్తాము అంటూ హెచ్చరికలు ట్విట్స్ రూపంలో చేసారు. 
5 million digital views for nota movie trailer
ఈ హెచ్చరికలు విజయ్ దేవరకొండ దృష్టి వరకు వెళ్ళినట్లు ఉన్నాయి నష్ట నివారణ చర్యలు వెంటనే చేపడుతూ ‘నోటా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడమే కాకుండా ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 5న విడుదలకాబోతోంది అంటూ కొద్ది సేపటి క్రితం ప్రకటన కూడ రిలీజ్ చేసారు. దీనితో విజయ్ దేవరకొండ జూనియర్ కు పైలెట్ గా మారి ‘అరవింద సమేత’ కు లైన్ క్లియర్ చేసినట్లు అయింది. 
రాజ‌కీయాల‌కు బ‌లైపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..
దీనితో టాప్ హీరోలతో పోటీ అంటే ఏమిటో విజయ్ అర్ధం అయినట్లు తెలుస్తోంది. ఒకవైపు తమ అభిమానులను తోటి హీరోల గురించి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని చెపుతూ ఉన్నా ఆవిషయాలను పట్టించుకోకుండా టాప్ హీరోల అభిమానులు తమ హీరోల పట్ల భక్తిని ఇలా అవకాసం చిక్కినప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: