టాలీవుడ్ ఎంపరర్ స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగినా అతడి సూపర్ క్రేజ్ స్థాయికి తగ్గట్టుగా విపరీతంగా డబ్బు సంపాదించలేదు అన్నదివాస్తవం దీనికి అనేక కారణాలు. పవన్ టాప్ హీరోగా ఎదిగినా ఏనాడు అందరి టాప్ హీరోలులా బ్రాండ్ ఎండార్స్ మెంట్లుచేసి కోట్లు గణించలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు చెప్పుకోతగ్గ వ్యాపారాలు కానీ ప్రముఖ సంస్థలలో పెట్టుబడులు కానీ లేవు. ఒకవిధంగా ఇలాంటి విభిన్న వ్యక్తిత్వమే పవన్ కు విపరీతమైన ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. 
Pawan Kalyan Porata Yatra
పవన్ స్థాపించిన ‘జనసేన’ తీవ్రఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని ఎన్నికలు దగ్గర పడుతున్నా పరుగులుతీయలేని స్థితిలో ఉంది అన్నగాసిప్పులు సందడి చేస్తున్నాయి. పవన్ స్టార్ హీరో స్టేటస్ కు ప్రస్తుత పవన్‌ ఆర్ధిక స్థితికి చాలతేడాలు ఏర్పడ్డాయని ఒకప్పుడు ప్రయివేట్‌ జెట్‌ విమానాల్లో తిరిగిన ఇప్పుడు కార్లలో రోడ్డు మార్గాన ప్రయాణిస్తు ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పవన్ చేతిలో నిధులు లేకపోవడం వల్లనే ఆయన పోరాటయాత్రకు నెలకు పైగా విరామం వచ్చింది కానీ ఆరోగ్య సమస్యలు కావు అంటూ కొందరి వాదన. 
First Break for Pawan Kalyans porata yatra
గత మూడేళ్ళలో తనదగ్గర ఉన్న డబ్బు అంతా తన జనసేనకు ఖర్చు పెట్టేసానని పవన్ తన సన్నిహితులు వద్ద అంటున్నట్లు సమాచారం. ప్రస్థుతం పవన్‌ చేస్తున్న పోరాటయాత్ర ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో దీనికి రోజుకు ఐదులక్షలు ఖర్చవుతున్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈపోరాట యాత్రలో పవన్ వెంట నడిచే వ్యక్తిగత సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది అంతా కలుపుకొని 160 మంది వరకు ఉన్న నేపధ్యంలో వీరందరికీ జీతాలు చెల్లించడంతో పాటు అనేక ఖర్చులు వచ్చి పడటంతో పవన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న పోరాట యాత్రకు కూడ నిధుల కొరత వెంటాడుతోంది అని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చే విరాళాలు మాత్రమే పవన్ ఆమోదిస్తున్నాడు కానీ ప్రముఖ వ్యక్తులు ఇచ్చే భారీ మొత్తాలను పవన్ స్వీకరించడంలేదు అని తెలుస్తోంది. 
దీనితో అభిమానులు ఇచ్చే చిన్నచిన్న విరాళాలతో ‘జనసేన’ ను నడపటం కష్టంగా ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
pawan kalyan blames chandrababu naidu in cheepurupalli  janasena porata yatra
దీనికితోడు ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ పత్రిక రాబోయే ఎన్నికలలో పవన్ కు కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి అన్న అంచనాలు చేస్తూ ఉండటంతో పవన్ ను నమ్ముకుని అతడితో కలిసి నడిచే వారికి ఈవార్తలు చాల అధైర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో రాబోతున్న ఎన్నికలలో పవన్ కింగ్ మేకర్ కాదు సరికదా కనీసపు స్థానాలు కూడ గెలుచుకోలేకపోతే అటు సినిమాల పరంగా ఇటు రాజకీయంగా పవన్ తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ పవన్ ను నమ్ముకున్న అభిమానులలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: