టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా నిర్మింప బడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ అక్కినేనిగా నటిస్తున్న నేపధ్యంలో ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈబయోపిక్ విషయంలో తనకు బాలకృష్ణ చేసిన సహాయాన్ని బయటపెట్టాడు. ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ తనకు అక్కినేని పాత్రలో నటించే విషయంలో ఎన్నో టిప్స్ ఇచ్చాడని చెపుతూ ‘తాతగారు ఇలా ఉండేవారు అలా ఉండేవారు’ అంటూ తనకు తన తాత అక్కినేని బాడీ లాంగ్వేజ్ ని నటించి చూపిస్తూ తాను అక్కినేని పాత్రలో రాణించడానికి ఎన్నో సహాయాలు బాలయ్య చేసాడు అంటూ బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు సుమంత్.
court case against Actor sumanth over check bounce issue
1950 లో వచ్చిన ‘పల్లెటూరి పిల్ల’ సినిమా నుండి అక్కినేని - రామారావులు కలిసి నటించిన ఎన్నో సినిమాలకు సంబంధించిన సన్నివేశాలతో పాటు తనకు ఈసినిమాలో అక్కినేనికి సంబంధించిన గెటప్స్ ఉంటాయని ఆపాత్రల గురించి బాలకృష్ణ చెప్పే వివరణ వింటే అక్కినేనికి బాలయ్య కన్నా నిజమైన అభిమాని ఉన్నాడా అని అనిపించడం సహజం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అక్కినేని నందమూరిల గురించి తమ కుటుంబాలకు కూడ తెలియని ఎన్నో విషయాలను ఈసినిమాలో చూపించబోతున్నారు అంటూ ఈవిషయంలో బాలయ్య క్రిష్ లు చేసిన రిసర్చి తన మైండ్ ను బ్లాంక్ చేసింది అని అంటున్నాడు. 
Sumanth
తాను నటిస్తున్న అక్కినేని పాత్ర కోసం తాను సన్నబడటానికి అదేవిధంగా తన బరువు తగ్గించుకోవడానికి చాల ఖచ్చితమైన డైట్ నీయమాలు పాటించిన విషయాలను బయటపెట్టాడు సుమంత్. అంతేకాదు తన చిన్నప్పుడు ‘దానవీరసూరకర్ణ’ లోని డైలాగ్స్ బట్టీపట్టి తన తాత అక్కినేని ముందు నటించి చూపెడుతూ ఉంటే అక్కినేని తాను చెప్పే ఎన్టీఆర్ సినిమాలోని డైలాగులకు తనను ముద్దు పెట్టుకున్న సందర్భాన్ని కూడ గుర్తుకు చేసుకుంటున్నాడు ఈ అక్కినేని మనవడు.  

ఈసినిమాలో నటించడానికి తాను షూటింగ్ స్పాట్ కు వెళ్ళినన్ని రోజులు తాను తన తాత చివరి రోజులలో వాడిన కారులోనే వెళ్లి తన తాత జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విషయాలను ఉద్వేగభరితంగా గుర్తుకు చేసుకున్నాడు సుమంత్. ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ బయోపిక్ వల్ల నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య మరిచిపోయిన జ్ఞాపకాలను గుర్తుకు చేస్తూ తమ ఇద్దరి కుటుంబాల సాన్నిహిత్యం కూడ ఎన్టీఆర్ బయోపిక్ వల్ల ఇప్పుడు మరింత పెరుగుతుంది అని అంటున్నాడు సుమంత్..  



మరింత సమాచారం తెలుసుకోండి: