వచ్చేనెల అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఆ పుట్టినరోజుతో ప్రభాస్ 39వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆరోజు ప్రభాస్ తన అభిమానులకు జోష్ ను కలిగించే రెండు వార్తలను అధికారికంగా ప్రకటింప బోతున్నాడు అంటూ లీకులు వస్తున్నాయి. 
Latest Updates: Prabhas New Movie 'Sahoo'
వాస్తవానికి ప్రభాస్ అభిమానులకు ఆనందం కలిగించే వార్తలు రెండే రెండు పెళ్లి కబురుతో పాటు ప్రభాస్ అభిమానులు ఎంతగానో  ఎదురు చేసుతున్న ‘సాహో’ విడుదల తేదీ ప్రకటన. ప్రస్తుతం ఈ రెండు విషయాల గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో మీడియాలో హడావిడి చేసే గాస్సిపులను అసలు వార్తలుగా ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. 
Prabhas in the film Saaho
`సాహో` షెడ్యూల్స్ పేరుతో ఇన్నాళ్లు దేశ విదేశాల్లో బిజీబిజీగా గడిపిన ప్రభాస్ తన పుట్టినరోజునాడు తన అభిమానులకు అందుబాటులోకి  రావాలని ఆలోచిస్తూ ఒక సామజి క కార్యక్రమం కోసం పిలుపు ఇవ్వ బోతున్నట్లు సమాచారం. ఈ మధ్య ఉత్తరాది మీడియాలో ప్రభాస్ పెళ్లి విషయంలో రకరకాల కధనాలు ప్రసారం చేసిన నేపధ్యంలో మన తెలుగు మీడియా కూడ ప్రభాస్ పెళ్లి గురించి అనేక ఊహా గానాలు చేసి ఈ మధ్యనే మౌనం వహించింది. 
Prabhas saaho
అయితే మీడియా మరో ట్విస్ట్ ఇస్తూ ఈ పుట్టినరోజు వేళ ప్రభాస్ తానూ పెళ్లి చేసుకోబేయే అమ్మాయి వివరాలు చెప్పడంతో పాటు 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న సాహో రిలీజ్ డేట్ ను ప్రకటించడమే కాకుండా   అభిమానుల్ని నిరాశపరచకుండా ఈసారి `సాహో`కు సంబంధించి ప్రభాస్  కొత్త లుక్ రిలీజ్ చేసే ప్లాన్ లోఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ‘సాహో’ నిర్మిస్తున్న యూవి క్రియేషన్స్ ఈవిషయమై దర్శకుడు సుజిత్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనితో పుట్టినరోజునాడు ప్రభాస్ తెలియచేసే వార్తలతో పాటు ప్రభాస్ ప్రమోట్ చేయబోయే సామాజిక కార్యక్రమ వివరాలు గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: