‘గీత గోవిందం’ తరువాత చాల సినిమాలు విడుదలైనా ఏసినిమా కూడ సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోలేకపోయాయి. ఈనేపధ్యంలో ఈవారం విడుదల కాబోతున్న ‘దేవదాస్’ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకుని అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈసినిమా విడుదల తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ తో ‘అరవింద సమేత’ అంతకముందు  ఒక వారం గ్యాప్ తో ‘నోటా’ విడుదలవుతున్న నేపధ్యంలో కలక్షన్స్ పరంగా ఏసంచలనాలు చేయాలి అన్నా ‘దేవదాస్’ కు కేవలం ఒక్క వారం గ్యాప్ మాత్రమే ఉంటుంది.
Nagarjuna and Nani in Devadas
దీనితో ఈమూవీకి మొదటిరోజు మొదటి షో నుండి టోటల్ పాజిటివ్ తాక రాకపోతే ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు నష్టపోయే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో రెండు రోజుల క్రితం కొందరు ఇండస్ట్రీ వ్యక్తులు ‘దేవదాస్’ సినిమాను చూసినట్లు తెలుస్తోంది. 
Devadas teaser,Devadas movie,Nani
తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున పేరుకు మాత్రమే మాఫియా లీడర్ కానీ సినిమా ఆద్యంతం హిల్లేరియస్  కామెడీ సీన్స్ తో ఉంటుంది అని ఈమూవీ చూసిన వారు తమ సన్నిహితుల దగ్గర చెపుతున్నట్లు టాక్. అంతేకాదు ఈసినిమాలోని నాగార్జున మాఫియా బ్లాక్ సంబంధించిన సీన్స్ చాల తక్కువగా ఉంటాయని ఈమూవీని ఇప్పటికే చూసినవారు చెపుతున్నట్లు సమాచారం.
DevaDas
ముఖ్యంగా ఈమూవీ ద్వితీయార్థం అంతా నానికామెడీ సీన్స్ బాగా వచ్చాయని అలాగే తమిళ నటుడు శరత్ కుమార్ పాత్ర కూడా ఈమూవీకి హైలెట్ అని అంటున్నారు. ఒకవిధంగా ఇలా రిలీజ్ కు ముందుగా ఇలా షో వేసి ఈసినిమా గురించి లీకులు ఇవ్వడం ఈమూవీని అత్యంత భారీ రెట్లు పెట్టి కొనుక్కున్న బయ్యర్లకు ధైర్యం కలిగించడానికి అన్న కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: