తెలుగు ఇండస్ట్రీలో అతి చిన్న వయసులు పాటల రచయితగా తన సత్తా చాటారు అనంత శ్రీరామ్.  ఈయన రాసిన పాటలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి.  రీసెంట్ గా సాక్ష్యం చిత్రంలో మంచి పాత్రలో కనిపించాడు అనంత శ్రీరామ్.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..పాటలో విషయాన్ని సూక్ష్మంగా చెప్పడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి శైలి తనకి ఎంతగానో నచ్చుతుందని చెప్పిన అనంత శ్రీరామ్, చంద్రబోస్ గురించి కూడా ప్రస్తావించాడు. పాటల రచయితగా ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశానని..అందరూ తనతో ఎంతో ప్రశాంతంగా వర్క్ చేయించుకున్నారని అన్నారు.

రాజమౌళి - కీరవాణిగార్లతో కలిసి పనిచేయడం చాలా సవాలుగా .. సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. రాజమౌళిగారు ఒక పాట ఇచ్చారంటే .. ఆ పాట రాయడానికి తగిన సమయాన్ని ఇస్తారని అన్నారు. పాట పూర్తయిన తరువాతనే షూటింగుకి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు గానీ, షూటింగ్ ఫలానా రోజున పెట్టేసుకున్నామని చెప్పేసి తొందరపెట్టరు. రచయితకి అంతటి అవకాశం .. సమయం ఇవ్వడమే రాజమౌళిగారిలోని గొప్పతనం అని చెప్పుకొచ్చాడు. 

ఇక చంద్రబోస్ గురించి మాట్లాడుతూ..నా కంటే ముందుగా వచ్చిన చంద్రబోస్ గారు రాసే పాటలు నాకు అసూయను కలిగించాయిగానీ, ఆ తరువాత వచ్చిన వారి పాటలేవీ నన్ను అసూయపెట్టలేదు. చంద్రబోస్ గారు రాసిన ఏ పాట అయినా అసూయకి గురి చేస్తుంది. అంతే కాదు ఒకసారి వినగానే శ్రోతలు పాడుకునేలా పాట రాయడం ఆయన ప్రత్యేకత.  నా పాట ఏదైనా నచ్చితే వెంటనే ఆయన ఫోన్ చేసి అభినందిస్తూ వుంటారు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: